చిరంజీవి ప్రాణం పెట్టి చేసిన మూవీ, ఆరేళ్ల కష్టం, మూడురెట్ల బడ్జెట్‌.. కట్‌ చేస్తే ఫ్యూజులు ఎగిరిపోయే రిజల్ట్

Published : Dec 10, 2024, 10:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన మూవీ, ఆరేళ్లు కష్టపడి చేసిన మూవీ, అత్యధిక బడ్టెట్ తో రూపొందిన ఈ మూవీ ఫలితం చూసుకున్నాక అందరికి ఫ్యూజుల్‌ ఔట్‌. 

PREV
15
చిరంజీవి ప్రాణం పెట్టి చేసిన మూవీ, ఆరేళ్ల కష్టం, మూడురెట్ల బడ్జెట్‌.. కట్‌ చేస్తే ఫ్యూజులు ఎగిరిపోయే రిజల్ట్
Chiranjeevi Konidela

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఒక సినిమాకోసం ఎంతో కష్టపడ్డారు. ఆరేళ్లు దానిపైనే వర్క్ చేశారు. నాలుగు సినిమాలకు సరిపడ కాల్షీట్లు ఇచ్చారు. సినిమా మొత్తం ఒకే డ్రెస్‌తో ఉన్నారు. ఆ మూవీ బడ్జెట్‌ అప్పట్లోనే హయ్యేస్ట్ బడ్జెట్‌ కావడం విశేషం. భారీ వీఎఫ్‌ఎక్స్ తో వచ్చిన సినిమా కూడా అదే. కట్‌ చేస్తే ఫలితం చూసుకున్నాక దర్శకుడు, హీరోలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.


 

25

చిరంజీవి ఎంతో ఇష్టపడి చేసిన మూవీ `అంజి`. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నమ్రత శిరోద్కర్‌ హీరోయిన్‌గా నటించింది. నాగబాబు కీలక పాత్రలో నటించారు. 2004 సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యింది. అటు బాలకృష్ణ `లక్ష్మి నరసింహా`, మరోవైపు ప్రభాస్‌ `వర్షం` సినిమాలు కూడా ఒకేసారి విడుదలయ్యాయి. ఈ సంక్రాంతికి ప్రభాస్‌ విన్నర్‌గా నిలిచాడు. బాలయ్య సినిమా కూడా అంత మాత్రంగానే ఆడింది. ఇక చిరంజీవి సినిమా `అంజి` మాత్రం దారుణంగా డిజాస్టర్‌ అయ్యింది. 
 

35

అయితే ఈ సినిమా కోసం చిరు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. నిర్మాత మూడు రెట్ల బడ్జెట్‌ పెంచేశాడు. దర్శకుడు సైతం ఎంతో శ్రమించి సినిమా చేశారు. ఈ మూవీ ఏడాదిలోనే పూర్తి చేయాలని భావించారు. కానీ వీఎఫ్‌ఎక్స్,షూటింగ్‌ లొకేషన్ల, పర్‌ఫెక్షన్‌ కోసం డిలే అయ్యింది. మొదట్లో చిరంజీవి 150రోజుల కాల్షీట్లు ఇవ్వగా అయిపోయాయి.

మళ్లీ కొంత గ్యాప్‌ తీసుకుని మరో 150కాల్షీట్లు ఇచ్చారట. అవి కూడా అయిపోయారు. మళ్లీ గ్యాప్‌ ఇచ్చి మరో 200కాల్షీట్లు ఇచ్చారట. అవి కూడా అయిపోయాయి. మళ్లీ వందకుపైగానే కాల్షీట్లు ఇచ్చారట. ఈ గ్యాప్‌లో చిరంజీవి నాలుగు సినిమాలు చేశారు, దర్శకుడు కోడి రామకృష్ణ మరో రెండు మూడు సినిమాలు పూర్తి చేసి రిలీజ్‌ చేశారు. 
 

45

కానీ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి మాత్రం ఈ మూవీకే స్టికాన్ అయి ఉన్నారు. మొదట్లో పది కోట్ల లోపు బడ్జెట్‌ అనుకున్నారు. ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది. ప్రారంభించిన ఆరేళ్లకి సినిమా పూర్తయ్యింది. అప్పుడు బడ్జెట్‌ 20కోట్లు. ఆ సమయంలో ఇంత బడ్జెట్‌ పెట్టి తీసిన మూవీ ఇదే. అందరు దీని గురించే మాట్లాడుకున్నారు.

అప్పట్లో ఇదొక `బాహుబలి` లాంటి మూవీ. స్క్రిప్ట్ పై నమ్మకంతో చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సినిమా చేశారు. అందుకే కాల్షీట్లు పెరిగినా కాదనకుండా ఇస్తూ వెళ్లారు. పారితోషికం కూడా తీసుకోలేదు. అడ్వాన్స్ తప్ప మరేదీ ముట్టలేదు. ఆరేళ్లకి 2004లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ అయ్యింది. వీఎఫ్‌ఎక్స్ ఆడియెన్స్ కి ఎక్కలేదు, కథలో కన్‌ఫ్యూజన్‌, చిరంజీవి మార్క్ కమర్షియల్‌ ఎలిమెంట్లు తగ్గాయి.

ఇలా మొత్తంగా సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సినిమాకి హైప్‌ బాగా ఉండటంతో భారీ రేట్లకి కొన్నారట బయ్యర్లు. హైయ్యెస్ట్ బిజినెస్‌ అయిన మూవీగానూ నిలిచింది. డిజాస్టర్ కావడంతో భారీ నష్టం వచ్చింది. దీంతో మళ్లీ కొంత వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందట. ఇలా చిరంజీవి ఎంతగానో నమ్మి చేసిన `అంజి` గట్టిగా దెబ్బకొట్టింది. 
 

55

ఈ సినిమా చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ మరణించిన విషయం తెలిసిందే. నిర్మాత శ్యామ్‌ ప్రసాద్ రెడ్డి సినిమాలు మానేసి జబర్దస్త్ వంటి టీవీ షోస్‌ చేస్తున్నారు. అలాగే చిరంజీవి 156వ సినిమా చేస్తున్నారు. `విశ్వంభర` పేరుతో ఈ మూవీ రూపొందుతుంది. వశిష్ట దర్శకుడు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. సోషియో ఫాంటసీగా ఈ మూవీ తెరకెక్కుతుంది. వీఎఫ్‌ఎక్స్ కి ప్రయారిటీ ఉంటుందని సమాచారం. 

read more: నోరు జారిన రాజేంద్రప్రసాద్‌.. ఎర్ర చందనం దొంగ హీరోనా.. అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు వివాదం?

also read: విజయ నిర్మల కాకుండా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎక్కువ సినిమాలు చేసింది ఏ హీరోయిన్‌తోనో తెలుసా? ఏకంగా 45 చిత్రాలు!

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories