రాజమౌళి సినిమాకంటే ముందు, మహేష్ బాబు , ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో మిస్సైన మూవీ ఏదో తెలుసా?

Published : Nov 15, 2025, 08:20 AM IST

Mahesh Babu Priyanka Chopra Missed Movie : మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈసినిమా కంటే ముందు  మహేష్ బాబు - ప్రియాంక చోప్రా.. కాంబినేషన్ లో  మిస్సైన మూవీ గురించి మీకు తెలుసా?  

PREV
15
మహేష్ - రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ టైమ్ టాలీవుడ్ నుంచి.. డైరెక్టర్ గా పాన్ వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు సూపర్ స్టార్. మహేష్ బాబు కెరీర్‌లోనే కాకుండా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే.. భారీ బడ్జెట్ తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది ఈసినిమా . దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమాలో నటించే కీలక నటీనటులపై కొంత సమాచారం బయటకు వచ్చింది. కాగా గ్లోబల్ ఈవెంట్ ద్వారా.. ఈసినిమా వివరాలు రాజమౌళి వెల్లడించబోతున్నారు.

25
మహేష్ బాబు–ప్రియాంక చోప్రా కాంబినేషన్ పై ఆసక్తి

అయితే ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ లో మహేష్ బాబు–ప్రియాంక చోప్రా జోడీ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. గతంలో మహేష్ కొంత మంది బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ తో జంటగా నటించారు. కానీ ప్రియాంక చోప్రాతో మాత్రం ఒక్క సినిమాలో కూడా చేయలేదు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీ.. మహేష్ బాబు టాలీవుడ్ హీరో.. క్రేజ్ పరంగా ఇద్దరు ఎక్కడా తగ్గరు.. మరి ఈ ఇద్దరు స్టార్స్ ను జక్కన్న ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు అన్నది ఇంట్రెస్టింట్ పాయింట్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మహేష్ బాబు–ప్రియాంక చోప్రా కాంబినేషన్ ఒక సినిమా మిస్ అయ్యిందన్న విషయం చాలామందికి తెలియదు. వీరి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా? అసలు ఎలా మిస్ అయ్యిందంటే?

35
మహేష్ బాబు–ప్రియాంక చోప్రా కాంబోలో మిస్ అయిన సినిమా..?

మహేష్ బాబు–ప్రియాంక చోప్రా కాంబోలో అసలు ఎప్పుడో ఒక సినిమా రావాల్సి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. SJ సూర్య దర్శకత్వంలో రూపొందిన నాని సినిమాలో హీరోయిన్ గా ముందుగా ప్రియాంక చోప్రాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈసినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ను మాత్రమే తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. దాంతో సెర్చ్ చేసి.. ప్రియాంకను తీసుకోవాలి అనుకున్నారు. ఆమెకు కూడా అప్పట్లో.. మహేష్ బాబుతో కలిసి నటించాలనే ఆసక్తి ఆమెకు ఉండేదని, అవకాశం వస్తే నటించేందుకు సిద్దమేనని కూడా అంగీకరించినట్టు సమాచారం. కానీ అదే టైమ్ లో ప్రియాంక బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీగా మారడంతో డేట్స్ క్లాష్ ఏర్పడి నాని సినిమాను వదిలేసుకోవాలసి వచ్చింది. దాంతో మరో బాలీవుడ్ హీరోయిన్అమీషా పటేల్‌ను ఈసినిమా కోసం తీసుకున్నారు. ఆ కాలంలో ఆమె కూడా బిజీగా ఉన్నప్పటికీ కొద్దిగా గ్యాప్ దొరకడంతో సినిమాలో నటించేందుకు అంగీకరించింది. ఆ విధంగా మహేష్ బాబు–ప్రియాంక చోప్రా కాంబినేషన్ మిస్ అయ్యింది.

45
సౌత్ లోనే మొదలైన ప్రియాంక కెరీర్

బాలీవుడ్‌లో ఆతరువాత హాలీవుడ్ లో స్టార్ గా మారిన ప్రియాంక చోప్రా కెరీర్ మాత్రం స్టార్ట్ అయ్యింది సౌత్ ఇండియన్ సినిమాతోనే. తమిళ స్టార్ హీరో విజయ్‌ సరసన తమీజాన్ సినిమాతో ప్రియాంక ఫిల్మ్ కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆసినిమా తరువాత బాలీవుడ్ వకు వెళ్లిపోయిన ప్రియాంక.. ఇటు వైపు చూడనేలేదు. హిందీలో అవకాశాలు భారీగా వచ్చిపడటంతో..రెండేళ్లలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇన్నేళ్ళ తరువాత మహేష్ తో సినిమా చేస్తోంది. గతంలో రామ్ చరణ్ తో కలిసి తుఫాన్ అనే సినిమాలో నటించింది ప్రియాంక. కానీ ఈసినిమా డిజాస్టర్ అయ్యింది.

55
మందాకినీ గా ప్రియాంక చోప్రా..

ఇప్పుడు ఎంతో సంవత్సరాల తర్వాత మహేష్ బాబు–ప్రియాంక చోప్రా కాంబినేషన్ మళ్లీ కలసి పాన్ వరల్డ్ స్థాయిలో రూపుదిద్దుకుంటుండటం అభిమానుల్లో భారీ ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో ప్రియాంక ‘మందాకినీ’ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది, మహేష్ బాబుతో వారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోంది అన్నది చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్ట్‌ నుంచి ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ పోస్టర్లకు ఆడియన్స్ , ఫ్యాన్స్ నుంచి సంచలన స్పందన లభించింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్లపై అనేక ఫన్నీ మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. అలాగే కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘సంచారి’ థీమ్ మ్యూజిక్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ అంశాలన్నీ కలిపి సినిమాపై హైప్ మరింత పెరిగింది. మరి రాజమౌళి ఏం చేయబోతున్నారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories