మహేష్ బాబు తన కెరీర్ లో కొన్ని వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల్లో మహేష్ నటనకు మంచి గుర్తింపే వచ్చింది. కానీ ఆ సినిమాల రిజల్ట్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ చిత్రంతో ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రయోగాలు చేసేందుకు మహేష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ మహేష్ కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారీ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. కొత్తగా ప్రయత్నించడం వల్ల మహేష్ బాబుకి ఎదురైన ఫ్లాప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
26
టక్కరి దొంగ
మహేష్ బాబు నటించిన ఏకైక కౌబాయ్ చిత్రం టక్కరి దొంగ. 2002 లోనే అత్యంత భారీ బడ్జెట్ లో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఈ మూవీ లో మహేష్ చేసిన రియల్ స్టంట్స్, సాహసాలు ఆకట్టుకుంటున్నాయి.
36
నాని
చిన్న పిల్లాడు పెద్దవాడిగా మారిపోయే సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ కి ఎక్కలేదు. మహేష్ కెరీర్ లో ఇది మరిచిపోదగ్గ చిత్రాల్లో ఒకటి.
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నిజం మూవీ సందేశాత్మక చిత్రంగా రూపొందింది. అవినీతి, లంచంకి వ్యతిరేకంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఒక్కడు లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి చిత్రంలో మహేష్ ని ఫ్యాన్స్ ఊహించుకోలేకపోయారు. ఫలితంగా నిజం మూవీ డిజాస్టర్ అయింది.
56
1 నేనొక్కడినే
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన జెన్యూన్ అటెంప్ట్ ఇది. తన తల్లిదండ్రులని గుర్తు చేసుకుంటూ మానసిక సంఘర్షణకి గురయ్యే హీరో కథ ఈ చిత్రం. సుకుమార్ స్టైలిష్ మేకింగ్ ఆకట్టుకుంది కానీ.. కమర్షియల్ డిజాస్టర్ అయింది.
66
స్పైడర్
సైకో విలన్ తో హీరో పోరాడే కథగా ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీలో కొన్ని అంశాలు సరిగ్గా కుదర్లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తేడా కొట్టింది. ఫలితంగా మహేష్ కెరీర్ లో భారీ నష్టాలని మిగిల్చిన చిత్రంగా స్పైడర్ నిలిచింది.