మహేష్ బాబు, ఎన్టీఆర్ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఆల్‌రెడీ పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు పాన్ ఇండియా కాదు, ఏకంగా ఇంటర్నేషనల్ ఇమేజ్‌పై కన్నేశారు. రాజమౌళి సినిమాతో గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేయబోతున్నారు మహేష్ బాబు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో జన్మించిన ఈ ఇద్దరు స్టార్స్. సినిమాని, నటననే వృత్తిగా ఎంచుకున్నారు. బాల నటుల నుంచే ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మెప్పించారు. ఎవరికి వాళ్లు నటనతో ఆకట్టుకుంటూ అలరిస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టార్స్ గా ఎదిగారు. అయితే ఈ ఇద్దరు స్టార్స్ సినిమాలు చేయకపోతే, సినిమా రంగంలోనే ఉండకపోతే, ఈ వృత్తినే ఎంచుకోకపోతే దేనికి సెట్ అవుతారు, వారికి ఏ జాబ్ సెట్ అవుతుంది.
స్టార్ హీరోయిన్ సమంత తన అభిప్రాయం చెప్పింది. మహేష్ బాబు, ఎన్టీఆర్‌లు హీరోలు కాకుంటే, సినిమా వృత్తిలే లేకుంటే దేనికి సెట్ అవుతారు, ఏ జాబ్ వారికి బాగా సూట్ అవుతుందనే ప్రశ్న వచ్చింది. దీంతో ఆమె తన అబ్జర్వేషన్‌ని బట్టి తన అభిప్రాయం తెలిపింది. మహేష్ బాబు కటౌట్, ఆయన లుక్, సాఫ్ట్ నేచర్‌ని బట్టి ఆయనకు పైలట్ జాబ్ అయితే బాగా సూట్ అవుతుందని తెలిపింది సమంత.
ఇక ఎన్టీఆర్ గురించి చెబుతూ, ఆయనకు ప్రతి దానిమీద బాగా నాలెడ్జ్ ఉంటుందని, ముఖ్యంగా బిజినెస్ విషయాల్లో బాగా అవగాహన ఉందని, రియల్ ఎస్టేట్ విషయాలు, మనీ సంపాదించే విషయాలు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది బాగా తెలుసు అని, ఆయనకు హీరో కాకపోతే బిజినెస్ అడ్వైజర్‌గా బాగా సూట్ అవుతాడని తెలిపింది సమంత. తన అభిప్రాయంగా ఆమె ఈ విషయాలను తెలిపింది. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా షోలో ఈ విషయాన్ని సామ్ వెల్లడించింది.