యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరగా కల్కి చిత్రంతో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ఫ్యాన్స్ దాహం తీర్చిన చిత్రం ఇది. మరోసారి ప్రభాస్ 1000 కోట్ల మార్క్ టచ్ చేసేలా చేసింది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.
సందీప్ రెడ్డి చిత్రంపై రోజుకొక ఆసక్తికర వార్త వైరల్ అవుతూ ఎగ్జైట్ మెంట్ పెంచేస్తోంది. ప్రభాస్ తో సందీప్ స్పిరిట్ అనే చిత్రం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కొరియన్ స్టార్ డాంగ్ లీ విలన్ గా నటించబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం లేదు. ఈ వార్త నిజమైతే ప్రభాస్ చిత్రానికి అంతర్జాతీయ క్రేజ్ గ్యారెంటీ.
ఇక హీరోయిన్ కరీనా కపూర్ నటించబోతోందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఏ విషయాన్ని కూడా సందీప్ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు కరీనా కపూర్.. ప్రభాస్, స్పిరిట్ చిత్రానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కొత్త మేకోవర్ కావాలని సందీప్.. కరీనాకి సూచించారట. కరీనా కపూర్ ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి.
Kareena Kapoor Khan
ఆమె తల్లి అయ్యాక కొన్ని ఫన్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. కానీ ఇలా భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించలేదు. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ప్రభాస్ మూవీ కోసం కరీనా జిమ్ కసరత్తులు మొదలు పెట్టిందట. మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్పిరిట్ చిత్రంలో ఆమె పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు ఇటు టాలీవుడ్ లో అటు బిటౌన్ లో వార్తలు వస్తున్నాయి.