Entertainment
రాశీఖన్నా శనివారంతో 34ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనదైన స్టయిల్‌లో బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది. 30 నవంబర్ 1990న న్యూఢిల్లీలో జన్మించిన రాశి ఖన్నా జన్మించారు.
రాశి ఖన్నా నటిగా తన కెరీర్‌ని 2013లో బాలీవుడ్ చిత్రం 'మద్రాస్ కేఫ్'తో ప్రారంభించారు, దీనిలో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గానే ఆడింది.
రాశీఖన్నా హిందీలో ఫస్ట్ సినిమా తర్వాత తెలుగులోకి గెస్ట్ రోల్‌తో అడుగుపెట్టింది. 2014లో వచ్చిన 'మనం'లో అతిధి పాత్రలో నటించింది.
`ఊహలు గుసగుసలాడే, హైపర్, శ్రీనివాస కళ్యాణం వంటి తెలుగు చిత్రాలలో, అయోగ్య, అరణ్మనై 3, సర్దార్ వంటి తమిళ చిత్రాలలో రాశి నటించారు. మలయాళంలోనూ యాక్ట్ చేసింది.
2024లో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'యోధ'తో రాశి ఖన్నా బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన 'ద సబర్మతి రిపోర్ట్'లో కూడా కీలక పాత్ర పోషించారు.
2022లో రాశి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దక్షిణాదిలో చాలా మంది దర్శకనిర్మాతలు నటీమణులను అందమైన బొమ్మలుగా భావిస్తారని, సినిమాల్లో వారికి బలమైన పాత్రలు రాయరని అన్నారు.
తన వ్యాఖ్యులు సౌత్‌లో దుమారం రేగడంతో ఆమె వివరణ ఇవ్వవలసి వచ్చింది. ఆ ఆరోపణలు కట్టుకథలని, దక్షిణాది గురించి తాను ఏమీ చెడుగా మాట్లాడలేదన్నారు.
ఒక ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ, "నా శరీర ఆకృతి కారణంగా నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవారు. నా సామర్థ్యాన్ని నా గత చిత్రాల విజయాలతో అంచనా వేసేవారు" అని అన్నారు.
చాలా మంది దర్శకనిర్మాతలు మహిళల కోసం బలమైన పాత్రలు రాయరని, ఈ రోజుల్లో దీని గురించి చర్చ జరుగుతుండటం సంతోషంగా ఉంది. నేను నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నాను.
రాశి ఖన్నా రాబోయే చిత్రాలలో తెలుగులో 'తెలుసు కదా', హిందీలో 'TME', తమిళంలో 'అఘాతియా' ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.