మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది క్రేజీ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చిరంజీవితో నటించిన 80, 90 దశకం నాటి హీరోయిన్లు కొందరు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్నారు.
చిరంజీవితో నటించిన హీరోయిన్లలో రాధ, రాధిక, విజయశాంతి, సుహాసిని, మాధవి, రంభ, సౌందర్య లాంటి హీరోయిన్ల పేర్లు ప్రధానంగా చెప్పొచ్చు. అయితే చిరు కొందరు స్టార్ హీరోల భార్యలతో కూడా నటించారు. అంటే చిరంజీవితో నటించిన తర్వాత ఆ హీరోయిన్లు కొంత కాలానికి స్టార్ హీరోలని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారన్నమాట. ఆ హీరోయిన్ల జాబితా ఇప్పుడు చూద్దాం.
sumalatha
ముందుగా సుమలత గురించి చెప్పాలి. మెగాస్టార్ తో కలసి సుమలత శుభలేఖ, ఖైదీ, అగ్నిగుండం లాంటి చిత్రాల్లో రొమాన్స్ చేసింది. ఇప్పటికీ సుమలత, చిరు మధ్య మంచి రిలేషన్ ఉంది. చిరంజీవి ఎప్పుడు కనిపించినా సుమలత అభిమానం చూపిస్తుంటారు. సుమలత కన్నడ స్టార్ హీరో దివంగత నటుడు అంబరీష్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి అక్కినేని అమలతో కూడా నటించారు. అమల, చిరంజీవి కలసి రాజా విక్రమార్క అనే సూపర్ హిట్ చిత్రంలో నటించారు. ఈ మూవీ 1990లో విడుదలైంది. ఆ మూవీ విడుదలైన రెండేళ్లకు అమల నాగార్జునని వివాహం చేసుకుని సెటిల్ అయింది. నాగార్జునతో పెళ్లయ్యాక అమల సినిమాలకు దూరం అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఆమె తల్లి పాత్రలు ఎంచుకుంటున్నారు.
Jyothika
చిరంజీవి, జ్యోతిక కలసి నటించిన చిత్రం ఠాగూర్. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో చిరు, జ్యోతిక మధ్య కెమిస్ట్రీ బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. 2003లో ఠాగూర్ చిత్రంలో నటించిన జ్యోతిక 2006లో స్టార్ హీరో సూర్యని వివాహం చేసుకుంది. ఇప్పటికీ జ్యోతిక లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో రాణిస్తోంది.
చిరంజీవి నటించిన మరో స్టార్ హీరో సతీమణి నమ్రత. నమ్రత గురించి పరిచయం అవసరం లేదు. చిరు, నమ్రత కలసి 2004లో అంజి చిత్రంలో నటించారు. ఈ చిత్రం అనేక కారణాల వల్ల డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి హీరోల భార్యలతో నటించిన చిత్రాల్లో ఇదొక్కటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నమ్రతకి ఇదే చివరి చిత్రం. ఆ తర్వాత మహేష్ బాబుని ప్రేమ వివాహం చేసుకుంది.