అల్లు అర్జున్‌ కాదు, పవన్‌ రావడం లేదు, `అన్‌స్టాపబుల్‌` 4 ఫస్ట్ ఎపిసోడ్‌ ఆయనతోనే.. బాలయ్య వేరే లెవల్‌ ప్లాన్‌

Published : Oct 19, 2024, 01:29 PM IST

బాలయ్య అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 4వ సీజన్‌ ఫస్ట్ గెస్ట్ మారిపోయారు. అల్లు అర్జున్‌ అని అంతా అనుకున్నారు. కానీ మరో లెజెండ్‌ని దించుతున్నాడు బాలయ్య.   

PREV
15
అల్లు అర్జున్‌ కాదు, పవన్‌ రావడం లేదు, `అన్‌స్టాపబుల్‌` 4 ఫస్ట్ ఎపిసోడ్‌ ఆయనతోనే.. బాలయ్య వేరే లెవల్‌ ప్లాన్‌

బాలకృష్ణ హోస్ట్ గా మారి చేసిన షో `అన్‌ స్టాపబుల్‌` ఎంతగా హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు వచ్చాయి. మొదటి రెండు సీజన్లు దుమ్మురేపింది. కానీ మూడో సీజన్‌ డీలా పడిపోయింది. మూడో సీజన్‌లో రాజకీయ నాయకులు, పెద్దగా పాపులారిటీ లేదని సెలబ్రిటీలు రావడంతో అంతగా కిక్‌ ఇవ్వలేకపోయింది. దీంతో తక్కువ ఎపిసోడ్లతోనే మూడో సీజన్‌ని ఆపేశారు. ఇక ఇప్పుడు నాల్గో సీజన్‌ని మాత్రం గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

25
Unstoppable

`అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` 4 వ సీజన్‌ ప్రారంభిస్తున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అల్లు అరవింద్‌ కోసమే ఈ షో చేసినట్టు కూడా బాలయ్య తెలిపారు. అయితే ఈ సారి బిగ్‌ స్టార్స్ ని దించబోతున్నట్టు వార్తలొచ్చాయి. నిర్వాహకుల హడావుడి చూస్తే అదే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ షోకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎవరు మొదటి గెస్ట్ అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అల్లు అర్జున్‌తో ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. ఆయనే మొదటి గెస్ట్ అని భావించారు. కానీ లెక్కలు మారిపోయాయి. రంగంలోకి మరో లెజెండ్‌ వచ్చాడు. 

35

`అన్‌స్టాపబుల్‌` 4వ సీజన్‌ ప్రారంభం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఉండబోతుందట. మూడో సీజన్‌లో ఆల్‌రెడీ చంద్రబాబు వచ్చాడు. ఏ పరిస్థితుల్లో తాము ఎన్టీఆర్‌ని వ్యతిరేకించాల్సి వచ్చిందో తెలిపారు. ఆ సమయంలో బాలయ్య కూడా ఉన్నారు, మీకు తెలుసు కదా అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తనపై ఉన్న వెన్నుపోటు దారుడు అనే ముద్రని తుడుచుకునే ప్రయత్నం చేశారు. ఈ ఎపిసోడ్‌ బాగానే వెళ్లింది.

అయితే ఇప్పుడు మరోసారి ఆయన ఈ షోకి రావడమే ఆశ్చర్యంగా మారింది. సీఎం అయిన తర్వాత తాను చేయబోతున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, గత ప్రభుత వైఫల్యాలను వెల్లడించే అవకాశాలున్నాయి. ఇక చంద్రబాబుపై ఎపిసోడ్‌ని రేపు షూట్‌ చేయబోతున్నారు. అయితే ఈఎపిసోడే మొదటగా టెలికాస్ట్ కాబోతుందట. ప్రారంభ ఎపిసోడ్‌గా ఇది ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్‌ని బాలయ్య వేరే లెవల్‌లో ప్లాన్‌ చేసినట్టు సమాచారం. 
 

45

ఈ నెల 24 ఈ సీజన్‌ ప్రారంభం కానుంది. ఫస్ట్ చంద్రబాబుపై షూట్‌ చేయబోతున్న ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌ ని షూట్‌ చేశారు. ఆయనదే ఫస్ట్ ఎపిసోడ్‌ అనే ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు రావడంతో దాన్ని మధ్యలో టెలికాస్ట్ చేస్తారట.

తెలుస్తున్న సమాచారం మేరకు మూడో ఎపిసోడ్‌గా స్ట్రీమింగ్‌ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లో `పుష్ప 2` సినిమా విడుదల కానుంది. దానికి దగ్గరలో సినిమాకి ప్రమోషన్ అయ్యేలా బన్నీ ఎపిసోడ్‌ టెలికాస్ట్ ఉంటుందని తెలుస్తుంది. దీంతోపాటు దుల్కర్‌ సల్మాన్‌ ఎపిసోడ్‌ కూడా షూట్‌ చేశారు. ఆయనది కూడా మధ్యలోనే టెలికాస్ట్ అవుతుందట. 
 

55

ఇదిలా ఉంటే అన్‌ స్టాపబుల్‌కి మరోసారి పవన్‌ కళ్యాణ్‌ రాబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆహా నిర్వాహకులు ఇప్పటికే పవన్‌ని సంప్రదించారట. కానీ ఆయన డేట్స్ ఇవ్వలేదని తెలుస్తుంది. కుదిరితే ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరిని కలిపి ఎపిసోడ్‌ చేయాలని భావించారు.

కానీ పవన్‌ టైమ్‌ ఇవ్వలేదని, ఇంతకి ఆయన రావడం కూడా కష్టమే అంటున్నారు. రెండో సీజన్‌లో ఆయన ఆల్‌రెడీ వచ్చిన నేపథ్యంలో మళ్లీ వస్తే కిక్‌ ఉండదని భావిస్తున్నారట. కానీ ఆహా నిర్వహకులు మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరి ఇది ఎంత వరకు పాజిబుల్‌ అవుతుందనేది చూడాలి. 

 రామ్‌ చరణ్‌ స్టేజ్‌పై ఫస్ట్ స్పీచ్‌, ఏం మాట్లాడాడో తెలుసా? కొడుకు మాటలకు చిరంజీవి ఎమోషనల్‌

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories