రాఘవేంద్రరావు-శ్రీదేవి కాంబోలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో దేవత ఒకటి. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో జయప్రద, శ్రీదేవి హీరోయిన్స్. వారు అక్కాచెల్లెళ్ల పాత్రలు చేశారు. అక్క కోసం జీవితాన్ని త్యాగం చేసేదిగా శ్రీదేవి పాత్ర ఉంటుంది. లవ్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి ఈ చిత్రాన్ని దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించారు. దేవత మూవీ శోభన్ బాబుకు మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి వరకు ఆయన ప్లాప్స్ తో సతమతమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు రాఘవేంద్రరావు దేవత చిత్రాన్ని గొప్పగా చిత్రీకరించారు.
దేవత చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. ''ఎల్లువొచ్చి గోదారమ్మ'' సాంగ్ ఇప్పటికీ ఫేమస్. అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. గోదావరి నది పాయల మధ్య ఉండే ఇసుకలో ఆ పాట చిత్రీకరించారు. బిందెల సెట్టింగ్ బాగుంటుంది. శ్రీదేవి గ్లామరస్ లుక్ పాటకు హైలెట్. నడుము అందాలు చూపిస్తూ శ్రీదేవి కుర్రకారును కట్టి పడేసింది. శోభన్ బాబు-శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది.