మహేష్ బాబు, నాగార్జునతో భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు.

Mahesh Babu Nagarjuna Multistarrer: కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ లో లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోలు. ఇద్దరు క్లామర్, ఫిట్ నెస్ విషయంలో  అందరికి షాక్ ఇస్తూ ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ కు పండగే అవుతుంది. అయితే మహేష్, నాగార్జున కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశాడట ఓ స్టార్ డైరక్టర్ కాని అది వర్కౌట్ అవ్వలేదు ఇంతకీ ఆ దర్శకుడెవరు. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు. 

Mahesh Babu  Nagarjuna Multistarrer That Never Took Off  Director Krishna Vamsi Dream Project in telugu jms

Mahesh Babu Nagarjuna Multistarrer: సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ ఇమేజ్ కు చాలా దగ్గరలో ఉన్నాడు. కింగ్ నాగార్జున  గ్లామర్ ఫిట్ నెస్ విషయంలో ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలు ఎవరికి వారు టాలీవుడ్ పై ఏదొ ఒక రకంగా గట్టి ప్రభావం చూపించిన హీరోలే. అంతే కాదు ఇద్దరు గతంలో మల్టీ స్టారర్ మూవీస్ చేసి హిట్ కొట్టినవారే.సోలో హీరోలుగా టాలీవుడ్ ను ఏలిని వీరిద్దరు కలిసి ఒక సినిమాలో కనిపిస్తే చూడాలని ప్రతీ అభిమానికి ఉంటుంది. అంతే కాదు నాగార్జున, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ మూవీ కూడా ప్లాన్ చేశారట. కాని అది సెట్స్ వరకూ రాలేదు. కారణం ఏంటి? 

Also Read: 14 ఏళ్లకే హీరోయిన్, 36 ఏళ్ళకు మరణం, భర్త స్టార్ సింగర్, 70 సినిమాలు చేసిన స్టార్ నటి ఎవరో తెలుసా?

Mahesh Babu  Nagarjuna Multistarrer That Never Took Off  Director Krishna Vamsi Dream Project in telugu jms

వీరిద్దరితో మల్టీ స్టార మూవీ ప్లాన్ చేసిందిఎవరో కాదు డైరెక్టర్ కృష్ణ వంశీ. అవును ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కృష్ణ వంశీ చేసిని సినిమాలన్నీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. నాగార్జున , మహేష్ బాబులతో కూడా విడివిడిగా హిట్ సినిమాలు చేశాడు  కృష్ణ వంశీ. కింగ్ నాగార్జునతో ఆయన చేసిన నిన్నే పెళ్లాడత ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇటు యూత్ ను కూడా ఆకట్టుకుంది ఆ మూవీ. 

Also Read: 400 మిలియన్ రికార్డ్ సాధించిన రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ, అక్కడ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా?


ఇక మహేష్ బాబుతో మురారి సినిమా ను డైరెక్ట్ చేశాడు  కృష్ణ వంశీ. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ ఇద్దరు హీరోలతో హిట్ సినిమాలు చేసిన  కృష్ణ వంశీ.. మల్టీ స్టారర్ కూడా ప్లాన్ చేశాడట. ఇద్దరికి కథ కూడా వినిపించాడట. కాని ఎందుకో ఇద్దరు హీరోలు ఈ సినిమా విషయంలో ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో వంశీ కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. 

Also Read:  కారు నెంబర్ కోసం బాలకృష్ణ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా, బాలయ్య మజాకా

Mahesh Babu

ఇక కింగ్ నాగార్జున గతంలో మల్టీ స్టారర్స్ చేశాడు. కార్తి కాంబోలో ఊపిరి, నాని కాంబినేషన్ లో దేవదాస్ లాంటి సినిమాలు చేశాడు నాగ్. ప్రస్తుతం సోలో హీరోగా సక్సెస్ సాధించలేకపతున్నాడు నాగ్. గ్లామర్, ఫిట్ నెస్ వీషయంలో మాత్రం కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక హీరోయిజం ఉన్న క్యారెక్టర్ రోల్స్ వైపు అడుగులు వేస్తున్నాడు నాగార్జున, ప్రస్తుతం రజనీకాంత్ కాంత్  కూలీ సినిమాలో నటిస్తున్నాడు. అంతే కాదు బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా గత ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్ గా రన్ చేశాడు. రాబోయే సీజన్ కూడా నాగార్జుననే చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మల్టీ స్టారర్ మూవీస్ చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెంకటేష్ కాంబినేషన్ లో హిట్ కొట్టాడు. ఆతరువాత ఆయన మల్టీ స్టారర్ మూవీ చేయలేదు. ప్రస్తుతం రాజమౌళి మూవీతో బిజీగా ఉన్నాడు. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతోంది. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా రాబోతోంది ఈసినిమా. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. 

Latest Videos

vuukle one pixel image
click me!