అతిలోక సుందరి శ్రీదేవి దక్షణాదితో పాటు హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 80వ దశకం నుంచే శ్రీదేవి హవా సౌత్ లో మొదలైంది. అప్పటి వరకు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఉన్నవారంతా శ్రీదేవితో పోటీ పడాల్సి వచ్చింది. 80వ దశకంలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సుజాత, శ్రీదేవి మధ్య అప్పట్లో పోటీ ఉండేదట. ఈ పోటీ వల్ల ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగినట్లు తెలుస్తోంది.