అందాజ్ అప్నా అప్నా
1994లో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలు గా వచ్చిన 'అందాజ్ అప్నా అప్నా' సినిమా సూపర్ ఫ్లాప్ అయ్యింది. ఇద్దరు హీరోలు ఉన్నా ఏమాత్రం బాక్సాఫీస్ ను ప్రభావింతం చేయలేకపోయింది.
అకేలే హమ్ అకేలే తుమ్
1995లో వచ్చిన ఆమిర్ ఖాన్ 'అకేలే హమ్ అకేలే తుమ్' కూడా ఫ్లాప్ అయ్యింది. 6 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
బాజీ
1995లో వచ్చిన 'బాజీ' బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈసినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
మేళా
2000లో వచ్చిన 'మేళా' సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అమీర్ ఖాన్, ట్వింకిల్ ఖన్నా, ఫైసల్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. మేళా 7 జనవరి 2000న విడుదలైంది. 16 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈమూవీ 15.04 కోట్లు వసూలు చేసింది.
మంగల్ పాండే
2005లో వచ్చిన 'మంగల్ పాండే: ది రైజింగ్' కూడా ఫ్లాప్. 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కేవలం 27 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాని అది నిరాశే అయ్యింది.
ఠగ్స్ ఆఫ్ హిందూస్థాన్
2018లో వచ్చిన 'ఠగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. 310 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కేవలం 150 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ నుంచి బాహుబలి సినిమాలు హిట్ అయిన తరువాత బాలీవుడ్ పోటీగా తీసిన చిత్రం ఇది.
లాల్ సింగ్ చడ్డా
2022లో వచ్చిన ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' 180 కోట్ల బడ్జెట్ తో తీసి 129 కోట్లు వసూలు చేసింది. ఈసినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా నటించారు.