రీరిలీజ్ లో కూడా రికార్డ్ బ్రేక్ చేసి మహేష్ బాబు, మురారి ఎంత రాబట్టిందంటే..?

First Published | Aug 11, 2024, 10:22 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రిలీజ్ సినిమాలే కాదు.. రీరిలీజ్ సినిమాలు కూడా రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

టాలీవుడ్ లో మహేష్ బాబు క్రేజ్ ను ఎవరూ క్రాస్ చేయలేరు.. 50 ఏళ్ళు వస్తున్నకుర్ర హీరోలు పోటి ఇస్తూనే ఉన్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈమూవీలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. ఇక మహేష్ బాబు బ్రేక్ చేసిన రికార్డ్ లు ఎన్నో ఉండగా.. ఆయన ఖాతాలో మరో సరికొత్త రికార్డ్ వచ్చి చేరింది. 

రజినీకాంత్ ప్రియురాలిగా ‌- తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 49 వ ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఈ ఏజ్ లో కూడా ఆయన 20 ఏళ్ళ కుర్రాడిలాగే కనిపించడం విశేషం. తాజాగా ఆయన పుట్టిన రోజు  జరుపుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ మహేష్ బర్త్ డే  సందర్భంగా.. తెగ సందడి చేశారు. కాగా ఈ క్రమంలోనే  అయిన ఆయన సూపర్ హిట్ సినిమా మురారి రీరిలీజ్ అయ్యింది. కృష్ణ వంశీ డైరెక్షన్ లో తెరెక్కిన ఈసినిమాలో సోనాలీ బింద్రే హీరోయిన్ గా నటించింది. ఇక ఈసినిమా  రీరిలీజ్ అవ్వడమే కాదు.. థియేటర్లలో రచ్చ రచ్చ చేసిందీ .. ముఖ్యంగా సూపర్ స్టార్ లేడీ  ఫ్యాన్స్ థియేటర్లలో తెగ సందడి చేశారు.   

తరుణ్ నువ్వే కావాలి సినిమాను మిస్ చేసుకున్న అక్కినేని హీరో ఎవరు..?


Murari

అంతే కాదు ఈసినిమా రి రిలీజ్ థియేటర్ లో పెళ్ళి సాంగ్ వచ్చే సమయానికి.. థియేటర్ లోనే పెళ్ళి చేసుకుని ఓ జంట షాక్ ఇచ్చింది. ఇక మురారి చూడటానికి వెళ్లిన ఆడియన్స్ చేతిలో అక్షంతలు, పూలు పట్టుకుని వెళ్ళి.. మహేష్ పై చల్లి హడావిడిచే చేశారు. ఇలా మురారి రి రిలీజ్ విచిత్రాలెన్నో జరగగా.. ఈసినిమా కలెక్షన్స్ విషయంలో కూడా అదే అద్భుతం కొనసాగింది. మురారి రిలీజ్అయినప్పుడు ఎంత ఆదరించారో.. అంతకంటే ఎక్కువగా ప్రేక్షకులు ఈసినిమాపై ప్రేమ చూపించారు. 

ఫస్ట్ భార్యకు విడాకులిచ్చి.. మళ్ళీ ప్రేమలో పడ్డ స్టార్స్ వీళ్లే..?
 

Murari

ఇక ఈ సినిమా కలెక్షన్స్  విషయానికి వస్తే..? రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా  రీరిలీజ్ అయిన మురారి సినిమాకు నైజాంలో 2.9 కోట్లు, ఉత్తరాంధ్రలో 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 18 లక్షలు, వెస్ట్‌లో 16 లక్షలు, నెల్లూరులో 3.5 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణా 25 లక్షలు, సీడెడ్‌లో 33 లక్షలు, కర్ణాటకలో 22 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షలు ఓవర్సీస్‌లో 60 లక్షలు కలుపుకుని  మొత్తంగా  ఈ సినిమా 5.45 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. 

పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా..? ఎలా మిస్ అయ్యిందబ్బా..?
 

అయితే కేవలం అడ్వాన్స్ బుక్కింగ్స్ ద్వారానే ఏపీ నైజాం కలుపుకుని మురారికి 2 కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అందులోనూ హైదరాబాద్ లో మాత్రమే కోటిన్నరకు పైగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వసూలు చేసిందట మురారి సినిమా. ఇలా రీరిలీజ్ తో రికార్డ్ సృష్టించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక రాజమౌళి సినిమాతో మహేష్ ఇంకెన్ని రికార్డ్ లు క్రియేట్ చేస్తాడో చూడాలి. 
 

Latest Videos

click me!