తరుణ్ నువ్వే కావాలి సినిమాను మిస్ చేసుకున్న అక్కినేని హీరో ఎవరు..?

తరుణ్ నటించిన సూపర్ హిట్ మూవీ నువ్వే కావాలి అందరికి గుర్తుండి ఉంటుంది. తరుణ్ కంటే ముందు ఈ మూవీ కొసం  ఓ రొమాంటిక్ హీరో కోసం ట్రై చేశారని మీకు తెలుసా..? ఇంతకీ ఎవరా హీరో..? 

సూపర్ హిట్ సినిమాలు కొన్ని ఒక హీరో దగ్గరకు వెళ్ళబోయి మరో హీరో దగ్గరకు వెళ్తుంటాయి. లేదా ఆ హీరో రిజెక్ట్ చేస్తే.. అవి మరో హీరో దగ్గరకు చేరుతాయి. ఆ సినిమా హిట్ అయితే.. అర్రే మంచి సినిమా మిస్ అయ్యామే అనుకుంటారు.. ఆ సినిమా ప్లాప్ అయితే.. చేయకపోవడం మంచిది అయ్యింది అని ఖషీ ఫీల్ అవుతారు.  లవర్ బాయ్ తరుణ్ నటించిన సూపర్ హిట్ మూవీ నువ్వే కావాలి సినిమాకు కూడా అలాంటి హిస్టరీనే ఉంది. ఈమూవీ కోసం అక్కినేని రొమాంటిక్ హీరోను అనుకున్నారట. కాని అది అతను రిజెక్ట్ చేయడంతో.. తరుణ్ ను అదృష్టం వరించింది. ఇంతకీ ఎవరా హీరో..? 

రజినీకాంత్ ప్రియురాలిగా ‌- తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

ఆ హీరో ఎవరో కాదు.. అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్. ఒకప్పుడు రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న సుమంత్... కెరీర్ విషయంలో కేర్ తీసకోకపోవడంతో రేస్ లో వెనకబడ్డాడు. సినిమాలపై ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం.. కథల విషయంలో రాంగ్ డెసిషన్స్... సుమంత్ ఇండస్ట్రీ నుంచి దూరంచేశాయని చెప్పవచ్చు.  మీ సినిమాలకు గ్యాప్ ఎందుకు వస్తుందని అడిగితే స్క్రిప్ట్ బాగా నచ్చితేనే సినిమా ఒప్పుకొంటానని అందుకే తన నుంచి కొత్త సినిమాలు రావడానికి లేట్ అవుతుంది అని చాలా సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈక్రమంలోనే  నువ్వే కావాలి సినిమాను సుమంత్ ఎలా మిస్ అయ్యాడో తెలుసా..? 

ఫస్ట్ భార్యకు విడాకులిచ్చి.. మళ్ళీ ప్రేమలో పడ్డ స్టార్స్ వీళ్లే..?
 


తన కెరీర్ లో సుమంత్ తనంతట తాను మిస్ అయిన ఏకైక సినిమా  నువ్వే కావాలి అని ఆయనే అన్నారు. తన కెరీర్ మొదట్లోనే స్రవంతి రవికిషోర్ తనకు నువ్వే కావాలి ఆఫర్ ఇచ్చారని.. కానీ డేట్స్ అజెస్ట్ కాకపోవడంతో.. ఆ సినిమా తాను  చేయలేనని చెప్పారట. ఈ విషయాన్ని సుమంత ఓసారి స్వయంగా వెళ్ళడించారు. ఆ సమయంలో తాను యువకుడు, పెళ్లి సంబంధం రెండు సినిమాలు ఒకేసారి చేస్తున్నానని.. అందుకే నువ్వే కావాలి సినిమా చేయడం కుదరలేదని అన్నారు. 

పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా..? ఎలా మిస్ అయ్యిందబ్బా..?
 

ఇక సుమంత్ తన కెరీర్ లో అవకాశం వచ్చి చేయలేకపోయిన సినిమా నువ్వే కావాలి ఒక్కటే అని అన్నారు. అయితే విచిత్రం ఏంటంటే.. ఇటు తరుణ్ .. అటు సుమంత్ ఇద్దరు .. ఇండస్ట్రీలో పెద్దగా యాక్టీవ్ గా లేరు. సుమంత్ సీతారామం లాంటి డిఫరెంట్ సినిమాలు ఒప్పుకుంటూ.. అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. కాని తరుణ్ మాత్రం అస్సలు ఇండస్ట్రీ వైపు చూడటంలేదు.. తన ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటున్నాడు. 

ఇక నువ్వే కావాలి విషయానికి వస్తే.. తరుణ్ హీరోగా.. రిచా జంటగా నటించిన సినిమా నువ్వే కావాలి. దాదాపు 20 ఏళ్ళు అవుతుంది ఈ సినిమా  రిలీజ్ అయ్యి.. అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు.. మంచి కలెక్షన్స్ కూడా సాధించింది ఈమూవీ.  కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈసినిమాకు కోటీ మ్యూజిక్ అందించగా.. ఈసినిమా మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయ్యింది. 

Latest Videos

click me!