సంజయ్ దత్ కొత్త వ్యాపారం 50 సిటిల్లో విస్తరణ, 1000 కోట్ల పెట్టుబడి?

First Published | Aug 11, 2024, 9:29 AM IST

మన దేశంలో పోర్ట్ ఫోలియోని విస్తరించడమే లక్ష‍్యంగా.. ఈ కంపెనీలో సంజయ్ దత్ దాదాపు రూ.1000 కోట్ల మొత్తం...

Sanjay Dutt


సంజయ్ దత్ కేవలం సినిమా నటుడుగానే తెలుసు. కానీ ఆయన బిజినెస్ రంగంలో ఎదుగుదల చూసిన వారు ఆయన్ని మాస్టర్ మైండ్ అంటారు. మనల్ని హీరోగా, విలన్ గా రకరకాలుగా  ఎంటర్‌టైన్ చేసే ఈ   స్టార్. నటించడంతో  పాటు పలు వ్యాపారాలు చేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. చాలా మంది హీరోలు ఫుడ్, రెస్టారెంట్స్ బిజినెస్ ల లో ఎక్కువగా కనిపిస్తారు. రీసంట్ టైంలో మహేశ్, బన్నీ, విజయ్ దేవరకొండ లాంటివాళ్లు మల్టీప‍్లెక్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇవన్నీ చాలా సాధారణ విషయాలన్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో, 'కేజీఎఫ్ 2' విలన్ ఎవరూ ఊహించని వ్యాపారంలోకి అడుగుపెట్టి... కళ్లు చెదిరే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి, లాభాలు పొందుతున్నారు.   


 సంజయ్ దత్  ఓవైపు లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు విలన్, సహాయక పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు.  'కేజీఎఫ్ 2'లో అధీరాగా భయపెట్టిన సంజూ.. ఆ తర్వాత  విజయ్ 'లియో' లో అదరకొట్టారు. ఇప్పుడు రామ్ ఇస్మార్ట్ శంకర్, ప్రభాస్-మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. భారీ రెమ్యునరేషన్ లు తీసుకుంటున్న ఆయన ఆ సొమ్ముని తీసుకెళ్లి బిజినెస్ లలో పెడుతున్నారు. ముఖ్యంగా ఆయన గత సంవత్సరం పెట్టిన లిక్కర్ బిజినెస్ బాగా క్లిక్ అయ్యింది. 
 



 రిటైల్ బిజినెస్ చేయడమే టార్గెట్ గా కార్టెల్ & బ్రోస్ అనే ఆల‍్కోబెవ్ (ఆల్కహాలిక్ బేవరేజ్) స్టార్టప్ లో పెట్టుబడి పెట్టారు సంజయ్ దత్. ఈ కంపెనీ ఎక్కువగా స్కాచ్-విస్కీ తయారు చేస్తుంది. మన దేశంలో పోర్ట్ ఫోలియోని విస్తరించడమే లక్ష‍్యంగా.. ఈ కంపెనీలో సంజయ్ దత్ దాదాపు రూ.1000 కోట్ల మొత్తం పెట్టుబడిగా ఉంచినట్లు చెప్పుతున్నారు. The Glenwalk పేరుతో తయారయ్యే ఈ విస్కీ కంపెనీకు నలుగురు పార్టనర్స్. వాళ్లు సామాన్యులు కారు. లిక్కర్ బిజినెస్ లో పండిపోయిన వాళ్లు. డ్రింక్ బార్ అకాడమీ ఫౌండర్ , మోర్గాన్ బేవరేజిస్ ఓనర్ ఉన్నారు. 
 


The Glenwalk కంపెనీ కేవలం ఆరు నెలల్లో ఇండియాలో ఆరు రాష్ట్రాల్లో 50  సిటీల్లో తమ కార్యకలాపాలను విస్తరించింది. మిడిల్ ఈస్ట్ లోనూ దూసుకుపోతున్నారు.మరో ప్రక్క ఈ స్కాచ్ విస్కీ దుబాయి, కెనడా, యూరప్, ఆస్ట్రేలియాలో అందించటానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఆన్ లైన్ లోనూ తమ ప్రొడక్ట్స్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 


మొదటి సంవత్సరంలోనే మహారాష్ట్రలోని మార్కెట్ లో  18%  షేర్ సొంతం చేసుకున్నారు. వచ్చే  ఫైనాన్సియల్ ఇయర్ లో 2.8 మిలియన్ల బాటిల్స్ అమ్మటమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈ విషయమై సంజయ్ దత్ మాట్లాడుతూ తమ ప్లానింగ్, నిజాయితీ, ముఖ్యంగా విస్కీ టేస్ట్ మార్కెట్ లో ముందుకు వెళ్లటానికి సహకరిస్తున్నట్లు చెప్తున్నారు.  
 


సంజయ్ దత్...ఆయన్ని బాలీవుడ్ సంజు బాబా అని ముద్దుగా పిలుచుకుంటూంటుంది. అతని కెరీర్ చుట్టూ వివాదాలు, జీవితంలో ఎన్నో సమస్యలు , అనారోగ్యాలు అన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అతను ఎలాంటివాడైనా ఏమైనా తమకు ఇష్టమే అనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంజు సొంతం. మున్నాభాయ్ లాంటి సినిమాలు సంజయ్ దత్ మాత్రమే చేయగలరని అంతా నమ్ముతారు. ఆ ఫెరఫార్మెన్స్ వేరొకరి సొంతం అయితే కాదు. అలాగే చిన్నప్పటి నుంచి సంజయ్ దత్ కు లగ్జరీ లైఫ్. విపరీతంగా ఖర్చుపెడతాడు. 
 


అలాగే కేజీఎఫ్ చాప్టర్ 2 ,  ‘లియో’ తర్వాత సంజయ్ దత్ మార్కెట్ ఒక్కసారిగా రెట్టింపు అయ్యిందన్న సంగతి తెలిసిందే. వరసపెట్టి సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆయనకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. . ఇప్పుడు రామ్ హీరోగా రూపొందుతున్న ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’లో విలన్ గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే  ప్ర‌భాస్, మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న  `రాజాసాబ్` లోనూ త‌న‌కు ఓ అత్యంత కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు కూడా ఆయన్ను అడుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 

Latest Videos

click me!