వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సినిమా సమయంలో ఏర్పడ్డ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. గతేడాది నవంబర్‌లో ఈ ఇద్దరు చాలా గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్స్ లో ప్రత్యేకంగా చెప్పుకునే మ్యారేజెస్‌లో వరుణ్-లావణ్యల పెళ్లి ప్రముఖంగా నిలుస్తుందని చెప్పొచ్చు.
అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి అందరికి తెలిసిందే. `మిస్టర్` సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే లవ్ ప్రపోజ్ ఎలా జరిగింది? ఎప్పుడు జరిగిందనేది సస్పెన్స్. దీనికి సంబంధించిన ఓ క్రేజీ సీక్రెట్‌ని బయటపెట్టింది లావణ్య త్రిపాఠి. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ అసలు విషయం చెప్పేసింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన `మిస్టర్` చిత్రంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఇందులో హేబా పటేల్ మరో హీరోయిన్. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సినిమా షూటింగ్ అయిపోయే సరికి ప్రేమగా మారిందట. అయితే సినిమా ఎండింగ్‌లోనే తన లవ్ ప్రోజ్ చేశాడట వరుణ్ తేజ్. అది కూడా సినిమా స్టయిల్‌లో చెప్పాడట. ఆ సినిమా పేరేంటో కూడా బయటపెట్టింది లావణ్య.
రాశీఖన్నాతో కలిసి `తొలిప్రేమ`లో నటించారు వరుణ్ తేజ్. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. ఇందులో కాలేజీలో రాశీఖన్నాకి లవ్ ప్రపోజ్ చేస్తాడు వరుణ్ తేజ్. అందరి ముందు ప్రపోజ్ చేస్తూ గులాబీ పువ్వు ఇస్తాడు. ఆయన ప్రపోజల్‌కి ఫిదా అయిన రాశీఖన్నా మరో ఆలోచన లేకుండా ఓకే చెబుతుంది. అందులో ఆ సీన్ బాగా పేలింది. తనకు లవ్ ప్రపోజ్ చేసే సమయంలోనూ సరిగ్గా అదే ఫాలో అయ్యాడట వరుణ్ తేజ. ఆ సినిమా స్టయిల్లోనే తనకు ప్రేమని వ్యక్తం చేశాడని, అప్పటికే వరుణ్ అంటే ఇష్టం ఏర్పడటంతో తను కూడా మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పిందట. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మరి ఇంతకి `తొలిప్రేమ`లో వరుణ్ తేజ్ రాశీఖన్నాకి ఏం చెప్పాడనేది చూస్తే.. కలలా నా జీవితంలోకి వచ్చావు. కల కంటున్నప్పుడు వెళ్లిపోయావు. మళ్లీ ఇన్నాళ్లకి ఇలా మెరిశావు. ఇది కలా నిజమా అర్థం కావడం లేదు. నిజమైతే ఈ పువ్వు తీసుకో. కలైతే కనీసం ఈ సారైనా నన్ను నిద్ర లేపు` అని చెబుతాడు వరుణ్. దెబ్బకి నవ్వులు చిందిస్తూ ఆ రోజాపువ్వుని తీసుకుంటుంది రాశీఖన్నా. దీంతో కాలేజ్ స్టూడెంట్స్ అంతా క్లాప్స్ కొడతారు. ఆ లవ్ ప్రపోజల్ చాలా లైవ్లీగా, పోయెటిగ్‌గా ఉంది. ఆకట్టుకుంది. మొత్తానికి సినిమా డైలాగ్‌తోనే లావణ్యని పడేశాడన్నమాట వరుణ్ తేజ్.
అయితే ఈ లవ్ ప్రపోజల్ ఇటలీలో జరిగిందట. అందుకే తనకు ప్రేమని వ్యక్తం చేసిన ఇటలీలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 1న చాలా గ్రాండ్‌గా వీరి మ్యారేజ్ జరిగింది. మెగా ఫ్యామిలీ, బంధుమిత్రుల, ఒకరిద్దరు సినీ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ `ఆపరేషన్ వాలెంటైన్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ మార్చి 1న విడుదల కాబోతుంది. మరోవైపు లావణ్య త్రిపాఠి ఇటీవల `మిస్ పర్‌ఫెక్ట్` ఓటీటీ మూవీలో నటించింది. ఇది మంచి ఆదరణ పొందింది. వరుణ్ తేజ్‌కి చాలా కాలంగా హిట్ లేదు. ఇప్పుడు `ఆపరేషన్ వాలెంటైన్`పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.