సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో మొదలయ్యే చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. రాజమౌళి ప్రతి విషయంలో చాలా టైం తీసుకుంటారు. స్క్రిప్ట్ రెడీ చేయడం దగ్గరి నుంచి.. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు, హీరో గెటప్ ఫిక్స్ చేయడం.. వర్క్ షాప్ లు ఇలా ప్రతి అంశంలో రాజమౌళి తనదైన మార్క్ ప్రదర్శిస్తూ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటారు.