రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది మహేష్ బాబు హీరోయిన్. 300 కోట్ల ఆస్తితో లగ్జరీ లైఫ్ ను గడుపుతోంది. టాలీవుడ్ లో5 సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. ఇంతకీ ఎవరామె?
తెలుగులో 5 సినిమాలు మాత్రమే చేసిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పాటేల్.. టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా గుర్తుండి పోయింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ఆస్తులకు సబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.
26
ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్
అమీషా పటేల్ అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో బీఏ చేసింది. అందులో ఆమె గోల్డ్ మెడలిస్ట్. బయో-జెనెటిక్స్ కూడా చదివింది. ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో ఆమె పాఠశాల విద్యను పూర్తి చేసింది.
36
అమీషా పటేల్ నికర ఆస్తి విలువ?
మీడియా కథనాల ప్రకారం, అమీషా పటేల్ నికర ఆస్తి విలువ రూ.265 కోట్లకు పైగా ఉంది. దీంతో ఆమె బాలీవుడ్‌లో అత్యధిక ఆస్తులున్న నటీమణులలో ఒకరిగా నిలిచింది. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ప్రమోషన్లు, ఆస్తుల అద్దెల ద్వారా ఆమెకు ఆదాయం వస్తుంది.
'గదర్ 2' బ్లాక్‌బస్టర్ కోసం అమీషా పటేల్ దాదాపు రూ.50 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రమోషనల్ ఈవెంట్లకు ఆమె చాలా ఎక్కువ ఫీజు తీసుకుంటుంది. పలు యాడ్ కాంట్రాక్టుల ద్వారా కూడా ఆమెకు భారీగా ఆదాయం వస్తుంది. ఆమె నెల సంపాదన సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా.
56
అమీషా పటేల్ చాలా విలాసవంతమైన జీవితం
అమీషా పటేల్ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఆమె వద్ద సుమారు 300-400 లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు ఉన్నాయి, వాటి విలువ రూ.3 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ముంబైలో ఆమెకు ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది, దాని మార్కెట్ విలువ దాదాపు రూ.40 కోట్లు. ఆమె వద్ద కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో రూ.3 కోట్ల రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రూ.2 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, రూ.1 కోటి విలువైన BMW 5 సిరీస్ ఉన్నాయి.
66
26 ఏళ్లుగా పరిశ్రమలో..
అమీషా పటేల్ 2000వ సంవత్సరం నుంచి సినీ పరిశ్రమలో నటిగా కొనసాగుతోంది. ఆమె 'కహో నా ప్యార్ హై', 'గదర్: ఏక్ ప్రేమ్ కథ', 'గదర్ 2: ది కథ కంటిన్యూస్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించింది. ఆమె రాబోయే చిత్రాలలో 'గదర్ 3', 'హనుమాన్ 2', 'దేసీ మ్యాజిక్' ఉన్నాయి.