దక్షిణ భారత దేశంలో పాపులర్ నటి కీర్తి సురేష్ ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకోవడానికి వెళ్తున్నప్పుడు ఓ అభిమాని ఇచ్చిన కాంప్లిమెంట్‌కి కీర్తి ఎలా స్పందించింతో తెలుసా.
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్ గా తమిళనాడు ప్రభుత్వ ఫిలిం అవార్డు అందుకున్నారు ఈ ఈవెంట్ కు వెళ్లడానికి తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో.. జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
26
పువ్వు సూపర్ అన్న అభిమాని
అవార్డు ఫంక్షన్ కు అద్భుతంగా రెడీ అయ్యి వెళ్లింది కీర్తి. చీర కట్టుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది. ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కబోతున్న కీర్తిని చూసి.. ఓ అభిమాని 'పువ్వు సూపర్' అని కామెంట్ చేశాడు.
36
ముద్దుగా రిప్లై ఇచ్చిన కీర్తి
ఆ మాట విన్న కీర్తి.. 'పువ్వు బాగుందా? నా లుక్ ఎలా ఉందో చెప్పు' అని సరదాగా బదులిచ్చింది. ఆమె క్యూట్ రియాక్షన్‌కు సంబంధించిన ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది.
ఆడమ్ దాసన్ దర్శకత్వం వహించిన 'పాంబు సట్టై' (2017) చిత్రంలోని నటనకు గాను కీర్తికి ఈ రాష్ట్ర అవార్డు లభించింది. ఇది ఆమెకు మొదటి రాష్ట్ర అవార్డు కావడం విశేషం.
56
కీర్తి సురేష్ ధన్యవాదాలు
అవార్డు అందుకున్న తర్వాత కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు: "నాకు మొదటి రాష్ట్ర అవార్డును అందించిన తమిళనాడు ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి, ఎల్లప్పుడూ అండగా నిలిచిన నా సహోద్యోగులు, సాంకేతిక నిపుణులు, నా బృందానికి ధన్యవాదాలు. అలాగే, అవార్డు గెలుచుకున్న వారందరికీ నా ప్రేమ, అభినందనలు."
66
రివాల్వర్ రీటా కీర్తి చివరి సినిమా
జె.కె. చంద్రు దర్శకత్వం వహించిన 'రివాల్వర్ రీటా' కీర్తి నటించిన చివరి చిత్రం. ఈ ఏడాది మలయాళం, తమిళం, తెలుగులో ఆమె నటించిన పలు చిత్రాలు విడుదల కానున్నాయి.