మహేష్ బాబు 100 సార్లు చూసిన సినిమా ఏదో తెలుసా..? ఆసినిమా అంటే అంత పిచ్చి ఎందుకు..?

First Published Jun 13, 2024, 12:36 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు బాగా ఇష్టమైన సినిమా ఏదో తెలుసా..? మహేష్ బాబు  ఏకంగా 100 సార్లు ఆసినిమాను చూశారా..?  ఇంతకీ ఎంటాసినిమా..? ఎవరా హీరో..? 
 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. అలనాటి సూపర్ స్టార్  కృష్ణ నట వారసత్వాన్ని తీసుకుని టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మహేష్.. ఇప్పుడు సోంత ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు మహేష్.  ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్.. ఆ ఒక్క సినిమాతోనే ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయ్యిందంటే.. ఫ్యాన్స్ కు పండగే. 

ఇక లాస్ట్ టైమ్  గుంటూరు కారం సినిమాతో ఫ్యాన్స్ ను  డిసప్పాయింట్ చేసిన మహేష్ బాబు.. రాజమౌళితో SSMB29 కోసం రెడీ అవుతున్నాడు. ఈసినిమాతో హాలీవుడ్ రేంజ్ లో అదరగొట్టబోతున్నాడు మహేష్. అంతే కాదు.. ఇప్పటికే ఈ సినిమా కోసం డిఫరెంట్ గా మేకోవర్ అయ్యాడు సూపర్ స్టార్.  బాడీతో పాటు జుట్టు, గడ్డం పెంచడం కూడా స్టార్ట్ చేశాడు. 

లావణ్య త్రిపాఠికి ఏమయ్యింది.. టెన్షన్ లో మెగా ఫ్యామిలీ, అందుకే పవన్ ప్రమాణస్వీకారానికి రాలేదా...?
 

మహేష్ బాబు  ఏడాకి ఒక్క సినిమా చేస్తాడు.. ఇక రాజమౌళి ఒక్క సినిమాను మూడేళ్లకుపైగా తీస్తాడు. ఇక ఈసినిమాను భారీగా ప్లాన్ చేస్తుండటంతో.. కనీసం నాలుగేళ్లకు పైగా ఈసినిమాకు టైమ్ పట్టొచ్చని అంటున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఈ నాలుగేళ్లు సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిందే. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మహేష్ బాబకు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది అందేంటంటే.? 
 

Krishna Birth Anniversary

మహేష్ బాబుకు ఇష్టమైన సినిమా ఏది..? ఇష్టం అంటే అంతా ఇంతా కాదు.. సాధారణంగా ఇష్టమైన సినిమాను ఓ పది పదిహేను.. లేక 20 సార్లు చూస్తారేమో.. కాని సూపర్ స్టార్ మాత్రం తనకు బాగా నచ్చిన..  ఓ సినిమాను ఏకంగా 100 సార్లు చూశాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా.. అదే మోసగాళ్లకు మోసగాడు మూవీ. 

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా ఐదు దశాబ్దాల కిందట వచ్చి అప్పట్లోనే రికార్డులు  సృష్టించింది. 50 ఏళ్ళ కిందట  ఈ సినిమాకు 8 లక్షల బడ్జెట్‌ అయిందట. ఫైనల్ రన్ లో బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా 50లక్షల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.  హాలీవుడ్ మూవీ ద గుడ్‌, ద బ్యాడ్‌ అండ్‌ అగ్లీ.. కథను తీసుకుని ఈసినిమాను తెరకెక్కించారు. 

కృష్ణ తన సొంత బ్యానర్‌ పద్మాలయ స్టూడీయోస్‌పై  నిర్మించిన ఈ సినిమా 1971 ఆగస్టు 27లో రిలీజ్ అయ్యింది. అంతే కాదు తెలుగులో ఫస్ట్  కౌబాయ్‌ మూవీ ఇదే.. ఈ రకంగా ఈసినిమా టాలీవుడ్ లో  ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. ఏఎన్నార్‌ తర్వాత 50లక్షల గ్రాస్‌ సాధించి మూడో హీరోగా కృష్ణ నిలిచాడు. ఈ సినిమా తమిళంతో పాటు హిందీలో కూడా డబ్బింగ్ అయ్యింది. 
 

ఇండస్ట్రీలో ఇన్ని రికార్డ్ లు సృష్టించిన ఈసినిమా అంటే మహేష్ బాబుకు ఎంతో ఇష్టమట. అంతే కాదు.. ఇప్పటికీ ఎన్ని సార్లు చూడమన్నా ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా. అంతే ఎంజాయ్ చేస్తూ.. ఈసినిమాను చూస్తారట. కాగా రీసెంట్ గా జరిగిన హరోంహర ఈవెంట్ లో ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు చెప్పడం విశేషం. తను మోసగాళ్లకు మోసగాడు సినిమాను వంద సార్లు చూశానని, తనకుఈ సినిమా  స్పెషల్  చెప్పాడు. 

అయితే చరిత్ర సృష్టించిన  ఇలాంటి సినిమాలకు రీమేక్ లు కాని.. సీక్వెల్స్ కాని చేయడం కరెక్ట్ కాదు.. ఆ అంచనాలు అందుకోలేకపోతే.. అది ఫ్యాన్స్ కు ఇబ్బందికర పరిస్థితి అవుతుంది. ఈక్రమంలో ఈసినిమా ఇన్‌స్పిరేషన్ తో మహేష్ టక్కరి దొంగ సినిమా చేశాడు. కాని ఈసినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. మహేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. 
 

Latest Videos

click me!