అన్నం కోసం ఉంచుకున్న 28 రూపాయలతో అది కొనేసిన త్రివిక్రమ్... సునీల్ మైండ్ బ్లాక్!

Published : Jun 13, 2024, 11:33 AM IST

త్రివిక్రమ్-సునీల్ ఫ్రెండ్స్. సినిమా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. రేపటికి భోజనం కోసం ఉంచుకున్న 28 రూపాయలు త్రివిక్రమ్ టక్కున ఓ వస్తువు కొనుగోలు చేసి ఖర్చు చేశాడట. దాంతో రూమ్ మేట్ సునీల్ షాక్ అయ్యాడట.   

PREV
16
అన్నం కోసం ఉంచుకున్న 28 రూపాయలతో అది కొనేసిన త్రివిక్రమ్... సునీల్ మైండ్ బ్లాక్!
Suni and Trivikram Srinivas

ఇప్పుడు స్టార్స్ గా వెలుగొందుతున్న చాలా మంది నటులు, దర్శకులు ఒకప్పుడు తిండికి, ఠికానా కు ఇబ్బంది పడినవారే. ఈ లిస్ట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నం చేశారు. 

26
Suni and Trivikram Srinivas

రచయితగా త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాక... సునీల్ కి ఆఫర్స్ వచ్చేలా త్రివిక్రమ్ చేశాడు. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ కాకముందే సునీల్ స్టార్ కమెడియన్ అయ్యాడు. త్రివిక్రమ్ దర్శకుడు అయ్యాక తన సినిమాల్లో సునీల్ కి చక్కని పాత్రలు రాశాడు. రచయితగా ఉన్నప్పుడు కూడా త్రివిక్రమ్ సునీల్ కి ప్రత్యేకంగా కామెడీ రోల్స్ రాసేవారు. 

 

36
Suni and Trivikram Srinivas

మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా ఉన్నారు. ఈ చిత్రాల్లో సునీల్ చేసిన పాత్రలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. కాగా సునీల్-త్రివిక్రమ్ స్టార్స్ కాకముందు అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. రెంటుకి, ఫుడ్ కి కూడా డబ్బులు ఉండేవి కావట. అప్పట్లో జరిగిన ఓ సంఘటన త్రివిక్రమ్ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నాడు. 

46
Suni and Trivikram Srinivas

సునీల్, త్రివిక్రమ్ లక్డికాపూల్ లో ఓ గదిలో ఉండేవారట. రెంటు కట్టడం లేదని ఓనర్ రూమ్ ఖాళీ చేయమన్నాడట. త్రివిక్రమ్ కి సిగరెట్ అలవాటు ఉండేదట. రూ. 30 ఉంటే రెండు సిగరెట్లు తాగాడట. దాంతో రూ. 28 మిగిలాయట. ఆ డబ్బులతో రేపు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా చేయాలో సునీల్ లెక్కలు వేస్తున్నాడట. 
 

56
Suni and Trivikram Srinivas

అప్పుడు మార్కెట్ లోకి కొత్తగా కూల్ డ్రింక్ టిన్ లు వచ్చాయట. త్రివిక్రమ్ ఆ డబ్బులతో కూల్ డ్రింక్ టిన్ కొన్నాడట. సునీల్ షాక్ అయ్యాడట. ఉన్న కొంచెం డబ్బులతో కూల్ డ్రింక్ కొనేశావ్, రేపు ఫుడ్ సంగతి ఏంటని త్రివిక్రమ్ ని సునీల్ అడిగాడట. రేపటి గురించి ఇప్పటి నుంచే ఆలోచిద్దాం... అన్నాడట త్రివిక్రమ్. 

 

66
Suni and Trivikram Srinivas

మనిషి భయపడితే ఉన్న దారులు కూడా కనబడవు. విషమ పరిస్థితుల్లో కంగారు పడటం సహజమే కానీ మరీ భయపడకూడని చెప్పేందుకు త్రివిక్రమ్ ఈ సంఘటన ఉదహరించారు. అప్పుడు 28 రూపాయల గురించి ఆలోచించిన త్రివిక్రమ్, సునీల్ ఇప్పటి రేంజ్ ఏమిటో తెలిసిందే.. త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు రూ. 30-40 కోట్లు తీసుకుంటున్నాడు.

click me!

Recommended Stories