లైంగిక దాడి కేసు, ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్, తెరపైకి శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ పేర్లు!

తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళా డాన్సర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టిన నేపథ్యంలో... ఆయన స్పందించారు. అలాగే జానీ మాస్టర్ భార్య అయేషా శేఖర్, గణేష్ మాస్టర్ల పేర్లు ప్రస్తావించింది. 
 

Jani Master

 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ డాన్సర్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Jani Master

 ఆమె చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. 

 ఇక సదరు మహిళ నార్సింగ్ నివాసి అయినందున నార్సింగ్ పోలీసులకు కేసు బదిలీ చేయగా జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) , స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 


Jani Master

జనసేన పార్టీ సభ్యుడిగా జానీ మాస్టర్ ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా   ఈ వివాదంపై జానీ మాస్టర్ మాట్లాడారు. మీడియా ముందుకు వచ్చిన జానీ మాస్టర్..  కుట్రపూరితంగా తనను ఇరికించినట్లు వాపోయాడు. 

యూనియన్ గొడవల్లో భాగంగా కొందరు ఆ మహిళతో తనపై కేసు పెట్టించారని అన్నారు. ఆధారాలు ఉంటే నన్ను శిక్షించించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆమెకు డబ్బులు ఇచ్చి  నాపై కేసు పెట్టించారు. గతంలో ఆమె నా దగ్గర పని చేసింది. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నాన్ మెంబర్స్ పని చేస్తున్నారని నేను ప్రశ్నించినందుకు ఇలా ఇరికించారని జానీ మాస్టర్ అన్నారు. 

Jani Master

జానీ మాస్టర్ భార్య అయేషా సైతం ఈ ఘటనపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ నాన్ యూనియన్ మెంబర్స్ పని చేస్తున్నారని తెలిసి సెట్స్ కి వెళ్లిన జానీ మాస్టర్... కెమెరా మెన్ తో ఇది కరెక్ట్ కాదని చెప్పారు. నాన్ మెంబర్స్ తో పని చేయించుకుంటే కార్డ్ ఉన్న మెంబర్స్ పని కోల్పోతారని చెప్పి వచ్చారు. 

శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ జోక్యం చేసుకోలేదు. బహుశా వాళ్ళు పనిలో బిజీగా ఉండొచ్చు. జానీ మాస్టర్ కి కూడా పనులు ఉన్నాయి. కానీ యూనియన్ మెంబర్స్ కి అన్యాయం జరగకూడదని ఆయన ప్రశ్నించారు. ఆ సాయంత్రానికి మేడ్చల్ సీఐ నుండి కాల్ వచ్చింది. ఆయనతో పాటు మరో ఐదుగురు వెళ్లి సీఐ ని కలిశారు. అనంతరం నేను అరెస్ట్ అయ్యానని జానీ మాస్టర్ ఫోన్ చేశారు. 
 

చేయని నేరానికి 14 రోజులు రిమాండ్ చేసి వచ్చారు. దీని వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని... జానీ మాస్టర్ భార్య అయేషా ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ గొడవల్లో భాగంగా ఇరికించారని జానీ మాస్టర్, అయేషా అంటున్నారు. మరి ఈ కేసులో అసలు నిజాలు ఏమిటో విచారంలో తెలియాల్సి ఉంది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

జానీ మాస్టర్ టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సైతం పని చేస్తున్నాడు. అతడికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అయితే తరచుగా జానీ మాస్టర్ వివాదాల్లో ఉంటారు. జానీ మాస్టర్ హీరోగా ఓ చిత్రం చేశారు. 

Latest Videos

click me!