ఎన్టీఆర్, శోభన్ బాబు, హరనాథ్ తర్వాత మహేష్ బాబేనా.. చాలా మంది ట్రై చేసి మునిగిపోయారు తెలుసా ?

Published : Nov 16, 2025, 07:08 PM IST

మహేష్ బాబు వారాణసి చిత్రంలో శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. దీనితో అభిమానుల్లో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. గతంలో అతి కొద్దిమంది నటులు మాత్రమే రాముడి పాత్రలో సక్సెస్ అయ్యారు. 

PREV
15
మహేష్ బాబు, రాజమౌళి వారణాసి మూవీ 

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి అనే చిత్రం రూపొందుతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి.. తన తదుపరి చిత్రాన్ని ఏ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు అనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. అభిమానులంతా ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని భవిస్తూ వచ్చారు. కానీ ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో జక్కన్న క్లారిటీ ఇచ్చారు. 

25
యాక్షన్ అడ్వెంచర్ కాదు అంతకి మించి 

ఇది యాక్షన్ అడ్వెంచర్ చిత్రమే. ఆఫ్రికా అడవులు అనేది ఈ కథలో ఒక భాగం మాత్రమే. పూర్తి కథ అదే కాలేదు. ఇందులో అంటార్కిటికా అంశాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు ఈ చిత్రంలో రామాయణం అంశాలు అతిపెద్ద హైలైట్ కానున్నాయి. మొత్తంగా ఇది టైం ట్రావెల్ ఫిక్షనల్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం అని చెప్పొచ్చు. 

35
శ్రీరాముడిగా మహేష్ బాబు 

ఈ మూవీలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో నటిస్తుండడం మరో బిగ్గెస్ట్ హైలైట్. రాముడి పాత్రలో నటించి మెప్పించడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే శ్రీరాముడు పాత్ర అంటే వెంటనే సీనియర్ ఎన్టీఆర్ తో కంపారిజాన్స్ మొదలిపోతాయి. తెలుగులో ఎన్టీఆర్ తర్వాత ఆ పాత్రలో చాలా మంది నటించి మెప్పించలేక ఫెయిల్ అయ్యారు. కాబట్టి రాముడి పాత్రలో నటించడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. కానీ అక్కడ ఉన్నది రాజమౌళి కాబట్టి అభిమానులు భరోసా తో ఉన్నారు. 

45
రాముడిగా ప్రయత్నించి ఫెయిల్ అయిన వాళ్ళు 

గతంలో ఎన్టీఆర్ తర్వాత ఆ పాత్రలో మెప్పించింది అతి కొద్దిమంది మాత్రమే. నటుడు హరనాథ్ శ్రీరాముడిగా పూర్తి స్థాయిలో నటించి మెప్పించారు. ఆ తర్వాత సంపూర్ణ రామాయణం చిత్రంలో శోభన్ బాబు శ్రీరాముడి పాత్రలో నటించి మెప్పించారు. నందమూరి బాలకృష్ణ శ్రీరామరాజ్యం చిత్రంలో నటించినప్పటికీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు. ఇక సుమన్ కూడా రాముడిగా నటించారు కానీ పూర్తి స్థాయిలో కాదు. 

55
ఎన్టీఆర్, శోభన్ బాబు సరసన మహేష్ బాబు 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా నటించాడు. కానీ ఆ సినిమా పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది. ఇప్పుడు శ్రీరాముడిగా నటించే అవకాశం మహేష్ బాబుకి దక్కింది. రాజమౌళి ఆల్రెడీ వారణాసి మూవీ ఈవెంట్ లో మహేష్ బాబు రాముడి పాత్ర గురించి ఒక రేంజ్ లో చెప్పేశారు. ఈ పాత్రలో మహేష్ ని తొలిసారి చూసినప్పుడు తనకి గూస్ బంప్స్ వచ్చాయని అన్నారు. మహేష్ బాబు శ్రీరాముడిగా మీరు ఊహించనంత అందంగా, ఊహించనంత పరాక్రమంగా, ఊహించనంత ప్రశాంతంగా ఉంటాడు అని రాజమౌళి వర్ణించారు. సో.. ఎన్టీఆర్, హరనాథ్, శోభన్ బాబు లాంటి నటుల సరసన చేరేందుకు మహేష్ కి ఇది అరుదైన అవకాశం. 

Read more Photos on
click me!

Recommended Stories