ఠాగూర్ తరహాలో క్లైమాక్స్ మార్చేశారు.. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ దెబ్బకు కృష్ణ, బాలకృష్ణ పరిస్థితి ఏంటో తెలుసా

Published : Nov 16, 2025, 04:17 PM IST

ఠాగూర్ తరహాలో చిరంజీవి తన సినిమా క్లైమాక్స్ మార్చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ సినిమా దెబ్బకి సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ సినిమాలపై గట్టిగా ప్రభావం పడింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. తనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా చిరంజీవి అత్యధిక ఇండస్ట్రీ హిట్ రికార్డులు అందుకున్నారు. ఖైదీతో చిరంజీవి ప్రభంజనం మొదలైంది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి కానీ ఖైదీ తరహాలో చిరంజీవి ఇండస్ట్రీ షేక్ అయ్యే హిట్ పడడం లేదు.

25
పసివాడి ప్రాణం మూవీ

ఆ సమయంలోనే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపేసింది. భగ్న ప్రేమికుడైన ఒక వ్యక్తి చిన్న పిల్లాడి కోసం తన జీవన శైలిని మార్చుకునే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. పసివాడి ప్రాణం చిత్రం మలయాళీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు.

35
క్లైమాక్స్ మార్చేశారు

మలయాళంలో క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు. అలా తెలుగులో చేస్తే ఆడియన్స్ అంగీకరించరు. దీనితో అల్లు అరవింద్, చిరంజీవి క్లైమాక్స్ మార్చేయాలి అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు కోదండ రామిరెడ్డితో కలిసి క్లైమాక్స్ లో మార్పులు చేశారు. ఫలితంగా పసివాడి ప్రాణం చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఏకంగా 4 కోట్లకుపైగా షేర్ రాబట్టింది.

45
కృష్ణ, బాలకృష్ణ సినిమాలకు దెబ్బ పడింది

ఈ చిత్రానికి పోటీగా వారం రోజుల ముందు సూపర్ స్టార్ కృష్ణ శంఖారావం చిత్రం విడుదలయింది. స్వయంగా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రారంభ వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ చిరంజీవి పసివాడి ప్రాణం సినిమా ప్రభావంతో శంఖారావం చిత్రం నిలబడలేకపోయింది.

55
ఠాగూర్ తరహాలోనే

పసివాడి ప్రాణం చిత్రానికి వారం రోజుల తర్వాత బాలకృష్ణ రాము విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. కానీ చిరంజీవి సినిమా ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద రాము చిత్రం యావరేజ్ గా నిలిచింది. పసివాడి ప్రాణం తరహాలోనే చిరంజీవి ఠాగూర్ క్లైమాక్స్ ని కూడా మార్చేసి విజయం సాధించారు.ఠాగూర్ మాతృక రమణ సినిమాలో హీరో చనిపోతాడు. కానీ ఠాగూర్ లో అలా జరగదు. రోజుకు 5 షోలతో 175 రోజులు ప్రదర్శించబడిన ఏకైక తెలుగు సినిమాగా పసివాడి ప్రాణం నిలిచింది. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు.

Read more Photos on
click me!

Recommended Stories