అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టినప్పటికీ ఫస్ట్ ప్లేస్ మహేష్ బాబుదే.. నాలుగు చిత్రాలతో టాప్ లో సూపర్ స్టార్

Published : Sep 08, 2025, 10:34 AM IST

సైమా అవార్డ్స్ లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అవార్డు గెలుచుకున్నారు. అల్లు అర్జున్ కి సైమాలో ఉత్తమ నటుడిగా ఇది మూడో అవార్డు. 

PREV
15
పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ప్రస్తుతం పీక్ లో ఉంది. పుష్ప 2 విజయం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో బన్నీ తిరుగులేని హీరో అయ్యారు. ప్రస్తుతం బన్నీ సన్ పిక్చర్స్ నిర్మాణంలో అట్లీ దర్శకత్వంలో దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సైమా( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డుల వేడుక దుబాయ్ లో ఘనంగా జరుగుతోంది.

25
ఉత్తమ నటుడిగా బన్నీ 

సైమా అవార్డ్స్ లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అవార్డు గెలుచుకున్నారు. బన్నీ వరుసగా మూడోసారి సైమా అవార్డు గెలుచుకున్నారు. అల వైకుంఠపురములో, పుష్ప1, పుష్ప 2 చిత్రాలకు బన్నీకి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. 

35
మహేష్ బాబుదే టాప్ ప్లేస్  బన్నీ

హ్యాట్రిక్ సాధించినప్పటికీ సైమా అవార్డ్స్ లో అగ్ర స్థానం మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుదే. ఇప్పటి వరకు మహేష్ బాబు ఏకంగా నాలుగు సార్లు సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, మహర్షి చిత్రాలకు మహేష్ కి ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ దక్కాయి. మహేష్ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. 

45
మహేష్, బన్నీ తర్వాత ఎన్టీఆర్ 

సైమా అవార్డులు 2012లో ప్రారంభం అయ్యాయి. తొలి సైమా అవార్డుల వేడుకలో దూకుడు చిత్రంతో మహేష్ ఉత్తమ నటుడిగా బోణీ కొట్టారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డు దక్కించుకుని మహేష్, బన్నీ తర్వాత నిలిచారు. 

55
ఇతర హీరోలు 

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, రాంచరణ్ రంగస్థలం, నాని దసరా, బాలకృష్ణ లెజెండ్ , ప్రభాస్ బాహుబలి 2 చిత్రాలకు ఉత్తమ నటులుగా సైమా అవార్డులు దక్కించుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories