Demon Pavan: బిగ్‌బాస్ తెలుగు 9లో మూడో కామనర్‌గా డిమోన్ పవన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. స్టేజ్ మీదే తన యాక్టివ్ వైపు చూపిస్తూ సీరియల్ యాక్టర్ భరణితో కలిసి పుషప్స్ వేసి ఆకట్టుకున్నారు. ఇంతకీ డిమోన్ పవన్ ఎవరు? అతని పేరు వెనుక ఉన్న కథేంటీ?
Bigg Boss Telugu Season 9 : కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌ను కొత్త కాన్సెప్ట్‌తో రాబోతుంది. "డబుల్ హౌస్ – డబుల్ డోస్" థీమ్ తో షోపై హైప్ క్రియేట్ చేశారు. ఈసారి ప్రత్యేకంగా కామనర్స్‌కి కూడా అవకాశం ఇవ్వడం షోలో కొత్త హైలైట్‌గా మారింది. అలా బిగ్‌బాస్ తెలుగు 9లో మూడో కామనర్‌గా డిమోన్ పవన్ (Demon Pavan) బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇంతకీ డిమోన్ పవన్ ఎవరు? అతని పేరు వెనుక ఉన్న కథేంటీ?
25
పేరుకి వెనుక ఉన్న కథ
డిమోన్ పవన్ ఎంట్రీ కాగానే ఓ టాస్క్ ఇచ్చేశారు కింగ్ నాగ్. దీంతో స్టేజ్ మీదే తన యాక్టివ్ వైపు చూపిస్తూ సీరియల్ యాక్టర్ భరణితో కలిసి పుషప్స్ వేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత పేరుకి వెనుక ఉన్న కథ ఏంటీ అని కింగ్ నాగ్ ప్రశ్నించగా? తాను జపనీస్ నవలలు ఎక్కువగా చదివే అలవాటు ఉందని పవన్ చెప్పారు. వాటిల్లో పాత్రలు మొదట వీక్‌గా ఉండి తర్వాత బలంగా ఎదిగేలా ఉంటాయని, తాను కూడా అలాగే జీవితంలో ఎదగాలని “డిమోన్ పవన్” అని పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. జపనీస్ కామిక్స్‌లో సూపర్ పవర్ సన్ గోకు తన ఫేవరెట్ క్యారెక్టర్ అని వెల్లడించారు.
35
మొదటి టాస్క్‌లో రీతూకి షాక్
బిగ్ బాస్ వేదికపై నాగార్జున మాట్లాడుతూ.. టాప్ 13లో నీకు అవకాశం వస్తే ఎవరిని హౌస్‌లోకి తీసుకెళ్తావని పవన్ ను ఇరకాటం పెట్టేశారు. దానికి పవన్, తనతోపాటు దమ్ము శ్రీజను తీసుకెళ్తానని చెప్పారు. హౌస్‌లోకి ఎంటర్ అవుతూ “ఫైనల్లి ఎంటర్ ది డ్రాగన్” అని చెప్పి అందరినీ పలకరించారు. అనంతరం కింగ్ నాగార్జున పవన్‌కి మరో టాస్క్ ఇచ్చారు. భరణి, రీతూ చౌదరి లలో కిచెన్‌లో గిన్నెలు కడిగే అవకాశం ఎవరికి ఇస్తావని అడిగారు. ఇమ్మాన్యుయేల్ రీతూ గిన్నెలు బాగా కడుగుతారని చెప్పడంతో పవన్ ఆ డ్యూటీ రీతూకి ఇచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన పవన్ బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ వైపు వెళ్లారు. ఉద్యోగం మానేసి అథ్లెటిక్స్‌లో ప్రయత్నించారు. కానీ, మెరిట్ లేకపోవడంతో ఆ అవకాశం రాలేదు. కెరీర్‌లో ఇంకా స్థిరపడకపోవడంతో తల్లిదండ్రుల సపోర్ట్‌తో బిగ్‌బాస్ కామనర్స్ ప్రోగ్రామ్‌కు అప్లై చేశానని చెప్పారు. అగ్నిపరీక్షలో ఫిజికల్ టాస్క్‌ల్లో దుమ్మురేపారు. ఓటింగ్‌లోనూ మంచి సపోర్ట్ దక్కి విజేతగా నిలిచి హౌస్‌లోకి ఎంట్రీ పొందారు. ప్రేక్షకులే తనను గెలిపించారని పవన్ సంతోషం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్‌కు ముందు పవన్ షార్ట్ ఫిల్మ్స్, ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చారు. టీవీలో కనిపించిన తర్వాత ఇరుగుపొరుగు, బంధువులు చాలా గర్వంగా ఫీల్ అయ్యారని చెప్పారు.
55
ఫ్యామిలీ రియాక్షన్
జిమ్ కంటే గ్రౌండ్‌కి వెళ్లడం, ఇంట్లోనే పుషప్స్ వేయడం తనకు ఇష్టమని పవన్ తెలిపారు. క్రికెట్ ఆడటం, వ్యాయామం చేయడం ద్వారా మైండ్ రిఫ్రెష్ చేసుకునేవాడినని చెప్పారు. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ద్వారానే తనకు అసలు ఫేమ్ వచ్చిందని చెప్పారు. “అగ్నిపరీక్షలోనూ బయట ఉన్నట్లుగానే నా స్వభావాన్ని చూపాను. అమ్మ అయితే జాబ్ చేసుకోమని, ఇవన్నీ వదిలేయమని చెప్పేది” అని పవన్ చెప్పారు. అయినా కూడా తన ప్రయాణానికి ఫ్యామిలీ సపోర్ట్‌గా నిలిచారని చెప్పారు.