తనూజ వల్ల ఇంట్లో 4 రోజులు ఏడుస్తూ ఉండిపోయిన సుమన్ శెట్టి భార్య.. దూరంగా ఉండమని చెప్పి, ఏం జరిగిందంటే

Published : Dec 20, 2025, 03:48 PM IST

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఒక సంఘటన కారణంగా సుమన్ శెట్టి భార్య 4 రోజులు ఏడుస్తూ ఉండిపోయారట. సుమన్ శెట్టి ఈ విషయం చెబుతూ ఎమోషనల్ అయ్యారు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు 9 షో ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. దాదాపు 100 రోజులకు పైగా కంటెస్టెంట్స్ హౌస్ లో టైటిల్ కోసం పోరాడుతూ వచ్చారు. చివరికి ఐదుగురు మాత్రమే మిగిలారు. బిగ్ బాస్ టైటిల్ అందుకునే కంటెస్టెంట్ ఎవరనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. టాప్ 5 కి చేరుకోలేకపోయిన కమెడియన్ సుమన్ శెట్టి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

25
టాప్ 5కి చేరుకోలేకపోయిన సుమన్ శెట్టి 

సుమన్ శెట్టి హౌస్ లో సరిగ్గా గేమ్ ఆడకపోయినా, యాక్టివ్ గా ఉండకపోయినా ఫినాలే వీక్ కి ముందు వరకు కొనసాగించారు. సింపతీతో నెట్టుకువచ్చాడు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా బిగ్ బాస్ నిర్వాహకుల సపోర్ట్ అతడికి ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

35
సుమన్ శెట్టి భార్య వ్యాఖ్యలు 

ఫ్యామిలీ వీక్ లో భాగంగా సుమన్ శెట్టి భార్య హౌస్ లోకి వచ్చారు. ఆమె తన భర్తతో సీక్రెట్ గా మాట్లాడుతూ.. తనూజకి దూరంగా ఉండమని చెప్పారు. ఆ మాటలని ఎపిసోడ్ లో సబ్ టైటిల్స్ లో వేశారు. దీనితో సుమన్ శెట్టికి, అతని భార్యకి తనూజ అభిమానుల్లో నెగిటివిటీ ఏర్పడింది. కొంత ట్రోలింగ్ కూడా జరిగింది. 

45
సుమన్ శెట్టి ఎమోషనల్ 

ఆ విషయం తెలుసుకున్న తన భార్య ఇంట్లో నాలుగు రోజులు సరిగ్గా తినకుండా ఏడుస్తూ కూర్చుంది అని సుమన్ శెట్టి అన్నారు. ఈ విషయం నేను ఇంటికి వెళ్ళాక తెలిసింది అని తెలిపారు. తన వల్ల తన భర్తకి నెగిటివిటీ వచ్చింది అని బాధపడింది అట. తాను తన భార్యని ఓదార్చినట్లు సుమన్ శెట్టి తెలిపారు. వాస్తవానికి నా భార్య తనూజకి దూరంగా ఉండమని చెప్పలేదు. తనూజతో పోటీగా గేమ్ ఆడమని చెప్పింది. 

55
నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే 

దానిని వేరే విధంగా అర్థం చేసుకున్నారు అని సుమన్ శెట్టి అన్నారు. తాను ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం తన ఫ్యామిలీ, భార్యే అని సుమన్ శెట్టి తెలిపారు. నన్ను తగ్గించే పనులు వాళ్ళు ఎప్పుడూ చేయరు అని అన్నారు. తనకు ఇంకెవరూ పీఆర్ లు లేరని, ఫ్యామిలీ సపోర్ట్ తో మాత్రమే ఈ స్థాయికి వచ్చానని అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories