స్టార్ హీరో ముందు ఇరికించాలని చూసిన డైరెక్టర్, నమ్రత గురించి చెప్పి నోరు మూయించిన మహేష్

Published : Oct 26, 2025, 03:06 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ అనిల్ రావిపూడికి కౌంటర్ ఇచ్చే క్రమంలో తన భార్య నమ్రత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విక్టరీ వెంకటేష్ ముందు జరిగిన ఈ సరదా సంఘటన గురించి ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ప్రాధ్యానత ఇస్తారో తన ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మహేష్ బాబు తన సినిమాలు, కుటుంబం, అదే విధంగా సేవా కార్యక్రమాలు తప్ప అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోరు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

25
స్టార్ హీరోయిన్లని పరిచయం చేసిన వెంకీ

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం విక్టరీ వెంకటేష్ వచ్చారు. చిన్నోడు కోసం పెద్దోడు వచ్చాడన్నమాట. వెంకటేష్.. మహేష్ బాబు, అనిల్ రావిపూడి ఇద్దరినీ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి.. వెంకటేష్ తెలుగు సినిమాకి పరిచయం చేసిన స్టార్ హీరోయిన్ల గురించి ప్రస్తావించారు. వెంకటేష్ మాట్లాడుతూ ఖుష్బూ, టబు, కత్రినా కైఫ్, దివ్య భారతి, ప్రీతీ జింతా, శిల్పా శెట్టి లాంటి వారంతా తన సినిమాలతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు అని వెంకటేష్ గుర్తు చేసుకున్నారు.

35
కథని బట్టే హీరోయిన్ ఎంపిక

వారిలో మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అనిల్ రావిపూడి వెంకీ ని ప్రశ్నించారు. లేడీస్ గురించి పర్టికులర్ గా ఒకరు బెస్ట్ అని చెప్పలేం. అలా చెప్పకూడదు కూడా. నేను కథని బట్టే హీరోయిన్లని ఎంపిక చేసుకుంటాను అని వెంకటేష్ అన్నారు.

45
మహేష్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం

అనిల్ రావిపూడి వెంటనే.. మహేష్ బాబు వైపు చూస్తూ మీరు నటించిన వారిలో బెస్ట్ హీరోయిన్ ఎవరు అని అడిగారు. మహేష్ ని ఇరికించే ప్రయత్నం అనిల్ రావిపూడి చేశారు. ఇలాంటి ప్రశ్న అడుగుతావని అనుకున్నా అంటూ మహేష్ కౌంటర్ ఇచ్చారు.

55
ఫన్నీ కౌంటర్ ఇచ్చి నోరు మూయించిన మహేష్

అనిల్ రావిపూడి ప్రశ్నకి మహేష్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. నేను నటించిన వారిలో నాకు బాగా ఇష్టమైన హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకున్నా అని అన్నారు. ఆ విధంగా తన భార్య నమ్రతనే తనకు బెస్ట్ హీరోయిన్ అని మహేష్ చెప్పినట్లు అయింది.

Read more Photos on
click me!

Recommended Stories