ఖైదీ తర్వాత అదే కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ.. కష్టం మొత్తం బూడిద పాలు, వెక్కి వెక్కి ఏడ్చిన చిరంజీవి

Published : Oct 26, 2025, 12:58 PM IST

భారీ బడ్జెట్ లో తెరకెక్కిన తన చిత్రం డిజాస్టర్ కావడంతో చిరంజీవి వెక్కి వెక్కి ఏడ్చారట. చిరు ఆ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. అయినా నిరాశ తప్పలేదు. ఇంతకీ ఆ చిత్రం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
ఖైదీ కాంబోలో మరో మూవీ 

మెగాస్టార్ చిరంజీవిని స్టార్ గా మార్చిన మూవీ ఖైదీ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంయుక్త మూవీస్ సంస్థ నిర్మించింది. ఖైదీ సంచలన విజయం కావడంతో మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఇదే సంయుక్త మూవీ బ్యానర్ లో, కోదండరామిరెడ్డి దర్శకుడిగా చిరంజీవి మరో చిత్రంలో నటించారు. ఈ మూవీ పేరు వేట. జయప్రద, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. జయప్రద ఈ మూవీలో హీరోయిన్ కావడం.. పైగా ఖైదీ కాంబినేషన్ కావడంతో వేటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

25
ప్రాణం పెట్టి నటించిన చిరు 

ఈ మూవీ కోసం చిరంజీవి ప్రాణం పెట్టి నటించారు. వివిధ గెటప్పులలో కనిపించారు. ముఖ్యంగా అండమాన్ జైలు సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతంగా ఉంటుంది. ది కౌంట్ ఆఫ్ మొంటో క్రిస్టో అనే నవల ఆధారంగా ఈ చిత్ర కథ రూపొందించారు. భారీ బడ్జెట్ లో చిత్రం తెరకెక్కింది. ఆడియో కూడా హిట్ అయింది. సుమలత, జగ్గయ్య, రంగనాథ్, నూతన్ ప్రసాద్ లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. 

35
కష్టం మొత్తం బూడిద పాలు 

కానీ ఈ మూవీ చిరంజీవికి, చిత్ర యూనిట్ కి ఊహించని షాక్ ఇచ్చింది. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ మొదలైంది. ఆడియన్స్ ఎందుకనో ఈ కథకి కనెక్ట్ కాలేకపోయారు. హీరోయిన్ హీరోని కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నచ్చలేదు. ఫలితంగా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీనితో చిరంజీవి ఈ మూవీ కోసం పడ్డ కష్టం మొత్తం బూడిద పాలు అయినట్లు అయింది. 

45
వెక్కి వెక్కి ఏడ్చిన చిరంజీవి 

దీనితో చిరంజీవి రెండు రోజుల పాటు వెక్కి వెక్కి ఏడ్చారట. చిరు ఈ విషయాన్ని ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ అనే షోలో రివీల్ చేశారు. చిరంజీవిని వేట మూవీ రిజల్ట్ ఎంతగానో బాధించింది. 

55
కోదండ రామిరెడ్డి రియాక్షన్ 

ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా వేట మూవీ ఫ్లాప్ పై స్పందించారు. ఆయన కూడా అదే కారణాన్ని చెప్పారు. హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఆడియన్స్ కి నచ్చలేదు. విపరీతమైన అంచనాలతో వచ్చిన వారికి అది నిరాశగా అనిపించింది అని కోదండ రామిరెడ్డి అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories