Mahesh Babu,Mufasa: The Lion King Movie, Review
రీసెంట్ గా ముఫాసా సినిమా తెలుగు డబ్బింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్‌లో వచ్చిన రెండవ భాగం ఇది. ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది.
ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్‌బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమాకు రిలీజ్ ముందు నుంచి భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో చూద్దాం.
Mufasa
ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. ఈ సినిమా ది లయిన్ కింగ్ లో కనపడి, చనిపోయిన ముఫాసా కథ, అతను అడవికి రాజు ఎలా అయ్యాడు. అతని సోదరుడు స్కార్ విలన్ ఎలా అయ్యాడనే విషయాలు వివరిస్తుంది.సినిమా ప్రారంభంలో సింబా , నాలా మరో బిడ్డను తమ జీవితాల్లోకి ఆహ్వానించటం కోసం అడవులోకి వెళ్లిపోతాయి.
ఆ సమయంలో అడవికి వెళ్లేటప్పుడు తమ కుమార్తె కైరా ని టిమోన్, పుంబాకు అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమంటాయి. ఆ సమయంలో వర్షం వస్తుంది. అది చూసి బుజ్జి సింహం పాప కైరా భయపడుతుంది. అప్పుడు రఫీక్ అనే కోతి వచ్చి మీ తాత ముఫాసా ఓ టైమ్ లో తనకు నీళ్ళు అంటే ఉన్న భయాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, ఎలా అడవికి రాజయ్యాడు అనే విషయాలు చెప్పి ఆ చిన్నారి సింహంలో ధైర్యం నూరిపేసే ప్రయత్నం చేస్తుంది.
Mufasa-The Lion King, Mahesh Babu, Mufasa
ఇంతకీ రఫీకా ఏం చెప్తుందంటే... ముఫాసా చిన్నప్పట్నుంచి చాలా చురుకైన వాడు. వేగంగా పరుగులు పెట్టడంలో .. తెలివిలో తనకు తానే సాటి అనిపించుకుంటాడు. తన తల్లి,తండ్రులతో ఆనందంగా జీవితం గడుపుతుంటే ఓ ప్రకృతి విపత్తు ఆ కుటుంబాన్ని విడతీస్తుంది.. ఓ వరదలో కొట్టుకుపోయి తల్లిదండ్రులకు దూరమవుతాడుముఫాసా.. వేరే చోటకు కొట్టుకుపోయి..అక్కడున్న రాజైన సింహం కుటుంబానికి దగ్గరవుతాడు.
అయితే వాళ్లు అతన్ని అనాధలాగే చూస్తూంటాడు. మొదట్లో ఆ రాజ్యానికి రాజు అయిన ఒబాసికి ముఫాసా అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ అతడి భార్య-కొడుకు.. ముఫాసాను చేరదీస్తారు. ముఫాసా పెరిగి పెద్దయ్యాక కూడా ఒబాసి మీద అయిష్టత తగ్గదు. తన కొడుకుని దెబ్బ కొడతాడని భయపడుతూంటాడు.
Mahesh Babu
అలాంటి సమయంలోనే ప్రమాదకర తెల్ల సింహాలు ఒబాసి భార్య మీద, ఆ తర్వాత సింహాలు అన్నిటి మీద దాడి చేస్తాయి. ఆ దాడి నుంచి కాపాడే ప్రయత్నంలో ఆ తెల్లసింహాల రాజు కొడుకును ముఫాసా చంపేస్తాడు. దీంతో రాజు అతడిపై కక్షగట్టి అతడి వాళ్లందరినీ అంతం చేయడానికి బయల్దేరతాడు తెల్ల సిహం రాజు. అప్పుడు తెల్లసింహాల నుంచి ముఫాసా ఎలా తప్పించుకుని రాజయ్యాడు. చిన్నప్పుడే విడిపోయిన తన తల్లి,తండ్రిని ఎలా కలుసుకున్నాడు.. ముఫాసా జీవితంలో జరిగిన ముఖ్యమైన అంశాలు ఏమిటనేది మిగతా కథ.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్లు దాకా వసూలు చేసింది. క్రిస్మస్, న్యూ ఇయిర్ ఎడ్వాంటేజ్ తో మరో పదికోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ముఫాసా చిత్రం ఈ స్దాయిలో కలెక్ట్ చేయటం మహేష్ బాబు అభిమానులకు పండగలాగ ఉంది. వారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు.