మహేష్ బాబు మిస్సయ్యాడు..రామ్ పోతినేని బుక్కయ్యాడు.. భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న సూపర్ స్టార్..

First Published | Jul 13, 2024, 7:44 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాడా..? ఓ ఊరమాస్ సినిమా కథను రిజెక్ట్ చేసి.. సేవ్ అయ్యాడు.. మహేష్ వదిలేసిన సినిమా చేసి రామ్ పోతినేని ఇరుకున పడ్డాడా..? 

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయబోయి.. మరొక హీరో చేసిన సినిమాలు చాలా ఉ న్నాయి. స్టార్ హీరోలు కొంత మంది రిజెక్ట్ చేసిన సినిమాలు.. మరో స్టార్ హీరో చేసి.. సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్.. డిజాస్టర్లు చూసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈక్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇలానే ఓ డిజాస్టర్ సినిమా నుంచి బయట పడ్డాడట. అయితే ఈసినిమా చేసి రామ్ పోతినేని ఇబ్బందుల్లోపడ్డాడట. 
 

ఇంటర్ కూడా చదవని స్టార్ హీరోయిన్.. కోట్లు సంపాదిస్తోంది..? వందల కోట్లకు వారసురాలు ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తాడు. చేసే ఒక్క సినిమా డిజాస్టర్ అయితే.. మహేష్  ఫ్యాన్స్ కు డిస్సపాయింట్ తప్పదు. అలానే వరుసగా హ్యాట్రిక్ ఫెయిల్యూర్ ను చూసిన మహేష్.. శ్రీమంతుడు సినిమా నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటున్నాడు. ఏ సినిమా చేసినా.. మినిమమ్ హిట్ పడేలా జాగ్రత్త పడుతున్నాడు. కథల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నాడు.

అల్లు అర్జున్ కు కలిసొచ్చిన రెండు సెంటిమెంట్లు.. బన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేవి ఇవే....?


అటు రామ్ పోతినేని మాత్రం వరుస ప్లాప్ లతో కాపురం చేస్తున్నాడు. డిఫరెంట్ గా ట్రై చేసినా.. వర్కౌట్ అవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయాడు రామ్. మాస్ ఇమేజ్ కోసం పాకులాడిన రామ్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అది సాధించగలిగాడు. అయితే ఆతరువాత ఆ ఇమేజ్ ను కాపాడుకోలేక పోయాడు. ఈక్రమంలోనే అతను చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. 
 

ఇద్దరు హీరోలతో ఎఫైర్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్, 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సోలోగా ఉన్న స్టార్ హీరోయిన్

Ram Pothineni starrer Skanda ott release update out action film to release on Disney Plus Hotstar

మాస్ ఇమేజ్ ను నిలబెట్టుకోవడం కోసం రామ్ చేసిన రెడ్, వారియర్ లాంటి సినిమాలు కనిపించకుండా పోయాయి. ఈక్రమంలోనే రామ్ పోతినేని పోయపాటి డైరెక్షన్ లో భారీ యాక్షన్ మూవీ స్కంద చేశాడు. ఈ సినిమాతో ఊరమాస్ ఇమేజ్ ను కొట్టేయాలని చూశాడు. కాని రామ్ ప్లాన్ కాస్తా ప్లాప్ అయ్యింది. సినిమా కాస్త డిజాస్టర్ అయ్యింది. బోయపాటి మార్క్ యాక్షన్ తో రూపొందిన ఈమూవీ 90కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. 60 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయిందట. 

Mahesh Babu

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈసినిమానే ముందుగా మహేష్ బాబు చేయాల్సి ఉందట. ఈకథను మహేష్ బాబు కోసం రాసుకున్నారట బోయపాటి శ్రీను. మహేష్ కు ఈ స్టోరీలైన్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇంత మాస్ సినిమాను తాను చేయలేనని మహేష్ సేఫ్ జోన్ చూసుకోవడంతో.. ఈ కథ రామ్ దగ్గరకు వెళ్ళిందని సమాచారం. రామ్ ఎలాగు ఇలాంటి కథల కోసమే చూస్తుండటంతో.. వెంటనే ఓకే చేశాడట. 

ఇలా సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన సినిమాను రామ్ పోతినేని చేసి.. భారీ ప్లాప్ ను మూట గట్టుకున్నాడు. అయితే ఈ విషయంలో అపీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. టాలీవుడ్ లో టాక్ తో పాటు.. సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ పోతినేని మళ్లీ ఇస్మార్ట్ శంకర్ నే నమ్ముకున్నాడు. ఈసినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ రెడీ అవుతోంది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాపైనే ఇద్దరు నమ్మకంతో ఉన్నారు. 

అటు మహేష్ బాబు మాత్రం రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్నాడు. అందుకు తగ్గట్టు లుక్ కూడా మార్చేశాడు సూప్ స్టార్. ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పని కూడా కంప్లీట్ అయ్యిందట. మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. అయితే ఈమూవీ కోసం మహేష్ బాబు మూడునుంచి నాలుగు ఏళ్లు.. రాజమౌళికి దారపోయాల్సిందే. 

Latest Videos

click me!