లెహంగాలో సితార మెరుపులు.. క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తున్న మహేష్ డాటర్ 

Published : Jul 15, 2023, 07:11 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని టీనేజ్ లోనే ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షిస్తోంది. 

PREV
115
లెహంగాలో సితార మెరుపులు.. క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తున్న మహేష్ డాటర్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని టీనేజ్ లోనే ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షిస్తోంది. సితార క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ అందరిని ఆకర్షిస్తున్నాయి. 

215

సితార ప్రతి విషయంలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది. మహేష్, నమ్రత సపోర్ట్ తో చిన్న వయసు నుంచే హాట్ టాపిక్ అవుతోంది. సర్కారు వారి పాట చిత్రంలో ఓ పాటకి సితార డ్యాన్స్ చేసి అదరగొట్టింది. 

315

ఇండియాలో ఎండార్స్మెంట్స్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ టాప్ లీగ్ లో ఉంటారు. ఇప్పుడు తండ్రి బాటలో సితార కూడా బ్రాండింగ్ మొదలు పెట్టింది. 

415

ఓ జ్యువెలరీ బ్రాండ్ కి సితార రీసెంట్ గా యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ నిర్వహించిన మీడియా సమావేశంలో సితార, నమ్రత పాల్గొన్నారు. సితార ఎంతో అందమైన సిల్వర్ కలర్ లెహంగాలో మెరుపులు మెరిపించింది. 

515

పీఎంజి జ్యువెలర్స్ అనే బ్రాండ్ కి సితార ఈ యాడ్ షూట్ చేసింది. మీడియా సమావేశంలో పలు ప్రశ్నలు సితారకి, నమ్రతకి ఎదురయ్యాయి. యాడ్ షూట్ ద్వారా వచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికి ఇచ్చారు అని అడగగా.. సితార చారిటి కోసం ఇచ్చాను అని సమాధానం ఇచ్చింది. 

615

అలాగే ఫిలిం ఇండస్ట్రీ లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారా అని ప్రశ్నించగా.. చాలా ఆసక్తిగా ఉన్నాను అని సితార కంఫర్మ్ చేసింది. దీనిపై నమ్రత స్పందిస్తూ మాయా పిల్లలకు ఇష్టం లేని పనులు చేయమని పేరెంట్స్ గ తాము బలవంతం చేయము అని నమ్రత పేర్కొంది.  

715

చిత్ర పరిశ్రమ అంటే చాలా మందిలో చెడు అభిప్రాయం ఉందని.. అది పోవాలని నమ్రత పేర్కొంది. తన ఫాదర్ మహేష్ యాడ్ చూసి చాలా బావుంది అని మెచ్చుకున్నట్లు సితార పేర్కొంది. 

815

గౌతమ్ గురించి మీడియా ప్రశ్నించగా.. గౌతమ్ ఎంట్రీకి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం చదువుకుంటున్నాడు అని నమ్రత పేర్కొంది. 

915

సితారని సినిమా ద్వారానే లాంచ్ చేయాలి.. లేదాయాడ్ ద్వారానే లాంచ్ చేయాలి అని మేము ఎప్పుడూ అనుకోలేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాం. 

1015

ఈ యాడ్ చేయడం సరైన నిర్ణయమే అని అనుకుంటున్నట్లు నమ్రత పేర్కొంది. ఇక మీ తల్లి నమ్రత మిస్ యూనివర్స్ కదా.. ఆమె నుంచి ఏమి చేర్చుకున్నారు అని ప్రశ్నించగా.. కాన్ఫిడెన్స్ అని సితార సమాధానం ఇచ్చింది. 

 

1115

సితార మీడియా సమావేశంలో తాను మాట్లాడే విధానం, కాన్ఫిడెన్స్, క్యూట్ లుక్స్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. సినిమాల్లో సితార తప్పకుండా సంచలనం అవుతుందని అంచనా వేస్తున్నారు. 

 

1215

సిల్వర్ కలర్ లెహంగాలో సితార క్యూట్ గా, అందంగా హొయలు పోతూ ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. సితార గ్లామర్ పరంగా కూడా అట్రాక్ట్ చేయడం మొదలు పెట్టింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

 

1315

మహేష్ బాబు ఆల్రెడీ యాక్టింగ్ లో బిజీగా ఉన్నారు. ఎండార్స్మెంట్స్ కూడా చేస్తున్నారు. మహేష్ ఈ స్థాయిలో బ్రాండింగ్ విషయంలో దూసుకుపోవడం వెనుక నమ్రత ప్లానింగ్ ఉండనే రూమర్స్ ఉన్నాయి. 

1415

దీనిపై నమ్రత స్పందిస్తూ.. అలా అయితే నేను యాడ్ ఏజెన్సీ పెట్టుకుంటే బావుంటుందేమో అంటూ చమత్కరించారు. పిఎంజి సంస్థ ప్రతినిధులు సితార గురించి మాట్లాడారు. 

1515

గత ఏడాదిగా సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. అంతే కాదు.. వాళ్ళ ఫ్యామిలీతో మాకు మంచి అనుబంధం ఉంది. సితార ఈ యాడ్ కి పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావించినట్లు వారు తెలిపారు. 

click me!

Recommended Stories