పెళ్లికి ముందు నమ్రతకు మహేష్‌ బాబు పెట్టిన కండీషన్‌ ఏంటో తెలుసా? అందుకే సంచలన నిర్ణయం

Published : Jun 13, 2025, 12:25 PM IST

మహేష్‌ బాబు, నమ్రత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు నమ్రతకి మహేష్‌ ఓ కండీషన్‌ పెట్టాడట. అందుకే ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. 

PREV
15
`వంశీ` సినిమా సమయంలో ప్రేమలో పడ్డ మహేష్‌, నమ్రత

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, హీరోయిన్‌ నమ్రత శిరోద్కర్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. `వంశీ` సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొంత కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 

అయితే వీరి పెళ్లికి ముందుగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఒప్పుకోలేదని సమాచారం. ఆయన నో చెప్పడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అంటుంటారు. మహేష్‌ ప్రేమకి సంబంధించి అక్క మంజుల తండ్రితో రాయబారం నడిపించారట.

25
మహేష్‌ బాబుకి బ్యాక్‌ బోన్‌లా నమ్రత

మొత్తానికి మహేష్‌, నమ్రతల పెళ్లికి కృష్ణ ఒప్పుకున్నారు. ఆ తర్వాత అంతా కలిసిపోయారు. మహేష్‌ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఇప్పుడు నమ్రతనే చూసుకుంటుందని సమాచారం. మహేష్‌ పర్సనల్‌ వ్యవహారాలను, ఫ్యామిలీని, పిల్లలు ఇలా అన్నీ తనే లీడ్‌ చేస్తోంది. 

మహేష్‌ స్టార్‌ హీరో కావడంతో ఆయనకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రెజర్‌ లేకుండా నమ్రతనే మ్యానేజ్‌ చేస్తుందని టాక్‌. ఇవే కాదు బిజినెస్‌లను కూడా  టేక్‌ కేర్‌ చేస్తున్నారని  తెలుస్తోంది. 

35
`ఫెమినా మిస్‌ ఇండియా` విజేత నుంచి సినిమాల్లోకి నమ్రత

ఇదిలా ఉంటే 1993లో ఫెమినా మిస్‌ ఇండియా విజేత అయిన నమ్రత.. ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చింది. బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అక్కడ చాలా సినిమాలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి `వంశీ` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 

ఈ మూవీ తర్వాత చిరంజీవితో `అంజి` లో నటించింది నమ్రత. అయితే మహేష్‌ ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన నమ్రతకి ఒక కండీషన్‌ పెట్టాడట.

45
పెళ్లికి ముందు నమ్రతకి మహేష్‌ బాబు కండీషన్‌

పెళ్లికి ముందు స్పష్టంగా ఓ విషయాన్ని చెప్పాడట సూపర్‌స్టార్‌. తనకు వర్కింగ్‌ ఉమెన్‌ భార్యగా వద్దు అని అన్నారట. అంటే నమ్రత నటించడం మహేష్‌ కి ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఇద్దరూ ముందే చర్చించుకున్నారట. అందుకే నమ్రత సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక సినిమాలు చేయకూడదని డిసైడ్‌ అయ్యింది. అప్పటి వరకు కమిట్‌ అయిన మూవీస్‌ కంప్లీట్‌ చేస్తూ, ఆ తర్వాత నుంచి  నటనకు గుడ్‌ బై చెప్పేసింది.

55
మహేష్‌ బాబు కోసం తన కెరీర్‌ని త్యాగం చేసింది నమ్రత శిరోద్కర్‌

ఆ మధ్య జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ విషయాన్ని స్పష్టం చేసింది నమ్రత. తాను మళ్లీ నటించే అవకాశం లేదని చెప్పింది. అదే సమయంలోనే మహేష్‌ పెట్టిన కండీషన్‌ గురించి వెల్లడించింది. మహేష్‌ పనిచేయని భార్య కావాలనుకున్నారు, అందుకే సినిమాలు మానేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత చాలా సినిమా ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసినట్టు తెలిపింది నమ్రత. 

మొత్తంగా మహేష్‌ కోసం, ఫ్యామిలీ, పిల్లల కోసం ఆమె తన కెరీర్‌ని త్యాగం చేసిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరోక్షంగా నమ్రత వ్యాపారవేత్తగా రాణిస్తుండటం విశేషం. ఇక వీరికి కొడుకు గౌతమ్‌ ఘట్టమనేని, కూతురు సితార ఉన్నారు. మహేష్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ 29` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories