సోనాలి బింద్రే నుంచి గౌతమి వరకు క్యాన్సర్ తో పోరాడి గెలిచిన ఫిల్మ్ స్టార్స్ వీళ్లే?

Published : Jun 13, 2025, 11:45 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంత మంది మాత్రం ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని కోలుకున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధిని జయించిన సినిమా స్టార్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

PREV
16

గౌతమి:

తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా స్టార్ డమ్ తెచ్చుకున్న గౌతమికి 35 ఏళ్ల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. దాదాపు పదేళ్లపాటు చికిత్స తీసుకున్న ఆమె, పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమాలు, టీవీ షోలలో కనిపిస్తున్నారు. రాజకీయంగా కూడా యాక్టివ్‌గా ఉన్న గౌతమి, క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు ఒక ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు.

26

మనీషా కొయిరాలా:

తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి మనీషా కొయిరాలాకు 2012లో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ అయింది. అమెరికాలో చికిత్స అనంతరం ఆమె కోలుకుని తిరిగి కెమెరా ముందుకు వచ్చారు. తన అనుభవాన్ని ఆమె "Healed: How Cancer Gave Me a New Life" అనే పుస్తకంలో వివరించారు.

36

సోనాలి బింద్రే:

తెలుగులో మురారి, మన్మధుడు, శంకర్ దాదా వంటి హిట్ సినిమాల్లో నటించిన సోనాలి బింద్రేకు 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఇది తీవ్రమైన స్టేజ్ అయినప్పటికీ, అమెరికాలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. ఆమె ఇప్పుడు క్యాన్సర్ పై అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

46

సంజయ్ దత్:

2020లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ (Stage 4) అని తేలింది. కానీ, కీమోథెరపీ, ఫిట్‌నెస్, జిమ్, యోగా, అభ్యాసం ద్వారా ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నారు.

56

మమతా మోహన్ దాస్:

2009లో మమతా మోహన్ దాస్ కు హాడ్జ్‌కిన్స్ లింఫోమా నిర్ధారణ అయింది. 2013లో మళ్లీ క్యాన్సర్ రావడంతో చికిత్స కొనసాగించాల్సి వచ్చింది. ఈ సమస్యలను తట్టుకుని ఆమె గట్టిగా నిలబడింది. చివరకు క్యాన్సర్ ను జయించింది మమత. కాని ప్రస్తుతం విటిలిగో అనే చర్మ వ్యాధితో బాధపడుతుంది. కాని ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టీవ్ గానే ఉంది మమతా మోహన్ దాస్.

66

హంసా నందిని :

టాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో కనిపించి అదరగొట్టిన హంసా నందిని బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం అందరికి తెలిసిందే. 2022 ఆరంభంలో క్యాన్సర్ బారిన పడినట్టు ప్రకటించిన ఆమె.. చాలా బాధను అనుభవించింది. అప్పటి నుంచీ ట్రీట్మెంట్ తీసుకుంటూ.. చివరకు క్యాన్సర్ ను జయించింది.

Read more Photos on
click me!

Recommended Stories