మరోవైపు వెంకటేష్, రామానాయుడు కూడా పాల్గొన్నారు. తెలుగు సినిమాని వీరే రూపొందించిన విషయం తెలిసిందే. అందుకే వీరు పాల్గొన్నారు. అలాగే నాగార్జున సైతం ఇందులో పాల్గొన్నారు. ఆయన అమితాబ్ బచ్చన్‌కి చాలా క్లోజ్. పైగా హైదరాబాద్‌లోనే ఓపెనింగ్ కావడంతో వీరంతా అటెండ్ అయ్యారు. అయితే ఓపెనింగ్ టైమ్‌లో వీరంతా పోటీపడ్డట్టుగా కనిపించారు.
నాగార్జున క్లాప్ నివ్వగా, ఆయనతోపాటు వెంకటేష్, కృష్ణ దాదాపు చాలాసేపు అక్కడే ఉన్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ పక్కనే కనిపించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే అప్పటికే కృష్ణ, నాగ్, వెంకటేష్ వంటి హీరోలంతా సౌందర్యతో సినిమాలు చేశారు. ఆ అనుబంధం కూడా ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చారని చెప్పొచ్చు.