L2 Empuraan Two Days Collection
L2 Empuraan Two Days Collection మలయాళ సినిమా చరిత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా `ఎల్ 2ఃఎంపురాన్`. పృథ్వీరాజ్ దర్శకత్వంలో వచ్చిన `లూసిఫర్` సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మధ్య గురువారం ఈ చిత్రం విడుదలైంది. తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఎంపురాన్ బాక్సాఫీస్ రికార్డు
'ఎల్ 2ః ఎంపురాన్' విడుదలైన మొదటి రోజే కలెక్షన్ల దుమారం రేపింది. కేరళాలోనే దాదాపు ఇరవై కోట్లు వసూలు చేయడగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. అదే రోజు ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. రెండో రోజు కూడా తన డామినేషన్ చూపించింది.
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూళ్లు
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనను చిత్రబృందం రిలీజ్ చేసింది. మోహన్ లాల్, మంజు వారియర్, పృథ్వీరాజ్ ఇంకా చాలా మంది నటించారు. ఈ భారీ వసూళ్లకు మోహన్ లాల్ తన అభిమానులకు థాంక్స్ చెప్పారు.