వారణాసిలో కలిసి నటిస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. రీసెంట్ గా మహేష్ బాబుకి థాంక్యూ మై దోస్త్.. అంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది ప్రియాంక.. కారణం ఏంటంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక నటించి, త్వరలో రిలీజ్ కాబోతోన్న హాలీవుడ్ చిత్రం 'ది బ్లఫ్' ట్రైలర్‌పై మహేష్ బాబు స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ పై, ప్రియాంక నటనపై ప్రశంసలు కురిపించారు. 'ది బ్లఫ్' ట్రైలర్ అద్భుతం, ప్రియాంక నటన రాజీపడనిది, అమోఘం అంటూ కొనియాడాడు సూపర్ స్టార్ మహేష్ బాబు…
25
థాంక్యూ మై దోస్త్
మహేష్ బాబు తన సినిమా ట్రైలర్ చూసి.. ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టడంతో చాలా సంతోషించింది ప్రియాంక చోప్రా. వెంటనే మహేష్ పోస్ట్ కు స్పందించింది. మహేష్ బాబు ప్రశంసలకు ప్రేమగా స్పందిస్తూ..'థాంక్యూ మై దోస్త్' అంటూ రిప్లై ఇచ్చింది. .తన స్నేహాన్ని గుర్తుచేస్తూ మహేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
35
వారణాసిలో కలిసి నటిస్తోన్న జంట..
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో... దాదాపు 15 వందల కోట్ల బడ్జెట్ రాబోతుంది వారణాసి సినిమా. ఈ చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా కనిపించనున్నారు. ఈ ఇద్దరు తారలతో పాటు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా ఈసినిమా రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతోంది. చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు జక్కన్న.
'ది బ్లఫ్' ట్రైలర్‌లో ప్రియాంక చోప్రా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. హాలీవుడ్ మూవీలో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ తో పిండేసింది గ్లోబల్ బ్యూటీ. తన కుమార్తెలను రక్షించుకోవడానికి, తన గతాన్ని ఎదుర్కొనే శక్తివంతమైన పాత్రలో ఆమె కనిపించనుంది. 'ది బ్లఫ్' చిత్రంలో తన కుటుంబం కోసం శత్రువులతో ప్రియాంక చోప్రా పోరాటం చేసే సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. ఈసినిమాలో ఆమె హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్ లో అభిమానులను అలరించబోతోంది.
55
ది బ్లఫ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
కేమన్ దీవుల నేపథ్యంలో సాగే ఈ ఎపిక్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' ఫిబ్రవరి 15న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. కార్ల్ అర్బన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వంలో, రస్సో బ్రదర్స్ నిర్మాణంలో రాబోతున్న హాలీవుడ్ పీరియడ్ థ్రిల్లర్ 'ది బ్లఫ్'. మరి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.