రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ డెస్టినేషన్ వెడ్డింగ్? ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?

Published : Nov 07, 2025, 12:14 PM IST

చాలా కాలంగా ప్రేమించుకుంటున్న రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఇంత వరకూ వాళ్లు పెళ్లిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి విజయ్,రష్మిక పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ జరగబోతోందో తెలుసా?

PREV
16
రష్మిక - విజయ్ పెళ్లి ఎక్కడో తెలుసా?

టాలీవుడ్ క్యూటెస్ట్ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇద్దరు తారల పెళ్ళి వార్త ట్రెండ్ అవుతోంది. తెరమీద, తెరవెనుక కూడా అద్భుతమైన కెమిస్ట్రీ ఉన్న ఈ ప్రేమపక్షులు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి, ఎక్కడ చూసినా వాళ్ల గురించే చర్చ జరుగుతోంది. వీరి పెళ్లి ఎప్పుడు జరగబోతోందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంట నిశ్చితార్థం అక్టోబర్ 2025లో హైదరాబాద్‌లో ప్రైవేట్‌గా జరిగింది. దీనికి వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ ఇద్దరి పెళ్లి డేట్ తో పాటు వేదిక కూడా ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

26
డెస్టినేషన్ వెడ్డింగ్

ఇక విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ ను రౌడీ హీరో టీమ్ ధృవీకరించింది. అక్టోబర్ 2025లో ఈవెంట్ జరిగినట్టు వారు వెల్లడించడంతో.. విజయ్ రష్మిక ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇక వీరి పెళ్ళిపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొత్త రిపోర్ట్స్ ప్రకారం, ఈ జంట తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈక్రమంలో రష్మిక, విజయ్ దేవరకొండ వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసకోబోతున్నట్టు తెలుస్తోంది. రాజవంశీయుల తరహా లో పెళ్లిని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

36
విజయ్ రష్మిక పెళ్లి ఎప్పుడు, ఎక్కడ?

సోషల్ మీడియా వైరల్ అవుతున్న వివరాల ప్రకారం. విజయ్, రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లోని అందమైన ప్యాలెస్‌లో జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈవిషయం ప్రస్తుతం ఇండస్ట్రీ లో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు పెళ్లి తరువాత హైదరాబాద్ లో ఇండస్ట్రీ కోసం గ్రాండ్ ఈవెంట్ ను కూడా వారు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయాలను రష్మిక మందన్న గానీ, విజయ్ దేవరకొండ గానీ అధికారికంగా ధృవీకరించలేదు.

46
రష్మిక మందన్న స్పందన

ఇక ఈ ఇద్దరు తారల ఎంగేజ్మెంట్, పెళ్లి గురించి రీసెంట్ గా రష్మిక స్పందించింది. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నిశ్చితార్థం గురించి అడిగినప్పుడు, తన సిగ్నేచర్ నవ్వుతో, "అందరికీ దాని గురించి తెలుసు" అని సింపుల్‌గా సమాధానమిచ్చింది. ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఇక పెళ్లి ఎప్పుడనేది అఫీషియల్ గా వీరు ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు. ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు రష్మిక మందన్న ఫ్యాన్స్ కూడా ఈ మ్యారేజ్ గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

56
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కెరీర్

విజయ్ రష్మిక కెరీర్ గురించి చూసుకుంటే.. విజయ్ కంటే రష్మికనే వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది. రష్మిక మందన్న ప్రొఫెషనల్‌గా చాలా బిజీగా ఉంది. ఆమె 'చావా', 'కుబేర', 'తమ్మా' గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాతో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా హిట్ సినిమాలు చేస్తూ.. నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక. ఇక ఇవి కాకుండా రష్మిక 'కాక్‌టెయిల్ 2', 'మైసా' అనే రెండు సినిమాలు చేస్తుంది. ఈమూవీస్ త్వరలో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

66
సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూపులు

మరోవైపు, విజయ్ దేవరకొండ కెరీర్ ఆశించినంత సక్సెస్ ఫుల్ గా లేదు. చివరిగా రౌడీ హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్‌డమ్' సినిమాలో కనిపించారు. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. గతంలో కూడా విజయ్ వరుస ఫెయిల్యూర్స్ ను చూస్తూ వస్తున్నాడు. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈక్రమంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా రౌడీ హీరోకు కలిసిరావడంలేదు. అన్ని జానర్లను విజయ్ సిన్సియర్ గా ప్రయత్నించాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తనకో టాక్సీవాల సినిమాన డైరెక్ట్ చేసిన రాహుల్ సంకృత్యన్ తో కలిసి ఓ పీరియడ్ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా అయినా అతనికి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories