SSMB28 లీక్స్.. సెట్స్ నుంచి మహేశ్ బాబు, పూజా హెగ్దే పిక్.. నెట్టింట వైరల్

First Published | Apr 15, 2023, 1:23 PM IST

మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమా శరవేగంగా కొనసాగుతోంది.  బ్యాక్ టు బ్యాక్ షెడ్యూళ్లతో పూర్తిచేస్తున్నారు. ఈ క్రమంలో సెట్స్ నుంచి పలు ఫొటోలు లీక్ అవుతున్నాయి. తాజాగా మహేశ్, పూజా కు సంబంధించిన పిక్ బయటికి వచ్చింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ (Trivikram) సినిమా శరవేగంగా కొనసాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూళ్లతో మూవీని పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకోగా తాజాగా మరో షెడ్యూల్ కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
 

అయితే, సెట్స్ నుంచి పలుమార్లు ఫొటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. దీంతో మహేశ్ లుక్స్, గెటప్, లోకేషన్లకు సంబంధించిన వివరాలు ముందుగానే తెలిసిపోతున్నాయి. ఇది ఒక రకంగా చిత్ర యూనిట్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే కొన్ని ఫొటోలు లీకై నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 
 


ఈ క్రమంలో తాజాగా మరో ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి మహేశ్ బాబు, పూజా హెగ్దే, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫొటో నెట్టింట చేరింది. వరుసగా లీకుల పర్వం కొనససాగుతూనే ఉంది. ఏదేమైనా ఇలాంటి ఫొటోలు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లకు మంచి ఎనర్జినీ కూడా ఇస్తున్నాయని చెప్పొచ్చు. 

లేటెస్ట్ పిక్ లో మహేశ్ బాబు గ్రీన్ చెక్స్ షర్ట్ లో కనిపిస్తున్నాడు. బాబు పక్కనే ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ పూజా హెగ్దేకు సీన్ వివరిస్తున్నారు.  పూజా రెడ్ లెహంగా వోణీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. వారి చుట్టూ అన్ని క్యాస్ట్యూమ్స్ కనిపిస్తుండటం చూడవచ్చు. 

ఇప్పటికే చిత్ర రిలీజ్ డేట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు లుక్స్ కు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా సినిమాపై అంచనాలు  పెంచేసుకుంటున్నారు. ఇక చిత్రంలో బాబు డ్యుయేల్ రోల్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. 

అతడు, ఖలేజా.. చిత్రాల తర్వాత 12 ఏండ్లకు మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ కావడం అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఈక్రమంలో ఎలాంటి సబ్జెక్ట్ తో గురూజీ రాబోతున్నాడనేది ఆసక్తిగానే ఉంది. చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న  విడుదల చేయబోతున్నారు. 

Latest Videos

click me!