బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం 'కిసీకా భాయ్ కిసికి జాన్'. సల్మాన్ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఫర్హద్ సంజీ దర్శకత్వం వహించారు. ఈనెల 21న అన్ని భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది.
అయితే, ప్రమోషన్స్ లో భాగంగా Kisi ka bhai Kisi ka Jaan లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటి పాలక్ తివారి (palak Tiwari) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సందర్భంగా సల్మాన్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
పాలక్ తివారి మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సెట్లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే అమ్మాయిలకు సెట్స్ లో ఆయన ఒక రూల్ పెట్టారు. అమ్మాయిలందరూ పద్ధతిగా బట్టలు ధరించాలనేదే ఆ రూల్. ఇలా రూల్ పెట్టడానికి ఓ కారణం ఉంది.
సల్మాన్ ఖాన్ సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గౌరవిస్తారు. అందుకే సెట్ లలో అమ్మాయిలు పద్ధతిగా కనిపించాలని కోరుకుంటాడు. డీప్ నెక్ ఉండే దుస్తులను అస్సలు వేసుకోకూడదు. తన చుట్టూ ఉండే మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. పైగా నా డ్రెస్సింగ్ పై కొన్ని కంప్లైంట్స్ ఉండడంతో సల్మాన్ ఖాన్ తో షూటింగ్ అనగానే మా అమ్మ సంతోషించింది.
ఎందుకంటే, సల్మాన్ ఖాన్ రూల్స్ కారణంగా షూటింగ్ కి నిండుగా దుస్తుల్లో వెళ్తుండడం చూసి మా అమ్మ సంతోష పడింది.' అంటూ పాలక్ తివారీ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ బ్యూటీ హిందీ మ్యూజిక్ వీడియోలతో క్రేజ్ దక్కించుకుంది. సల్మాన్ ఖాన్ చిత్రంతోనే ప్రేక్షకులను పరిచయం కానుంది. ఇక సల్మాన్ ఖాన్ తన సినిమాలో పంచె కట్టి తెలుగువారిలా ఆకట్టుకోబోతున్నారు. పైగా KBKJ లో బతుకమ్మ పాటను కూడా పెట్టడం సల్మాన్ ఖాన్ కి సంప్రదాయాలపై ఎంతటి గౌరవం ఉంటుందో తెలియజేస్తుంది.
ఇప్పటికే 'కిసికా భాయ్ కిసికి జాన్' నుంచి వచ్చిన పోస్టర్లు, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. అలాగే టాలీవుడ్ స్టార్స్ విక్టరీ వెంకటేష్, జగపతిబాబు, భూమిక చావ్లా కీలకపాత్రను పోషించడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. రామ్ చరణ్ కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. పాలక్ తివారి తో పాటు షహనాజ్ గిల్, విజయేందర్ సింగ్ కూడా అలరించబోతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. మరో ఆరు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.