ఈ డిసాస్టర్ నుండి ఆ హీరో ఎస్కేప్… పాపం బాలయ్య దొరికిపోయాడు!

First Published | Aug 20, 2024, 9:51 AM IST

బాలయ్య తన అభిమానులను అలరించే మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. అప్పుడు కెఎస్ రవికుమార్ సీన్ లోకి వచ్చారు. 
 

Actor Balakrishna

 ఇండస్ట్రీలో ఒకరు కోసం రాసుకున్న సబ్జెక్టు మరొకరి తో చేయటం కొత్త విషయం ఏమీ కాదు. చాలా కాలం జరుగుతన్నదే. ఎన్నో సినిమాలు అలా హీరోలు మారి హిట్ కొట్టినవే. అయితే కొన్ని సినిమాలు హీరో మారినప్పుడు డిజాస్టర్స్ అవుతూంటాయి. హీరో మారినప్పుడు అందుకు తగ్గ మార్పులు చేర్పులు చేయకపోతే సమస్యలు మొదలైపోతాయి. ముఖ్యంగా మాస్ సినిమాల్లో  ఏ హీరోకు తగ్గ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్ ని బట్టి కథలు వండాల్సి ఉంటుంది. అలా తారుమారైన ఓ కథ బాలయ్యకి డిజాస్టర్ ఇచ్చింది. ఆ సినిమా ఏంటో  చూద్దాం.

Balakrishna


ఆ టైమ్ లో బాలయ్య కెరీర్ వెలిగిపోతోంది. మాస్ సినిమా చేస్తే భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురవాల్సిందే. అప్పుడే ఆయన కెరీర్ కు బ్రేక్ లు వేసే సినిమాలు పడ్డాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ వర్కవుట్ కాకపోవటంతో తరువాత గ్యాప్ తీసుకున్న బాలయ్య తన అభిమానులను అలరించే మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. అప్పుడు కెఎస్ రవికుమార్ సీన్ లోకి వచ్చారు. 


Balakrishna


గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన జైసింహ సినిమాకు యావరేజ్‌ అనిపించుకున్నా.. రవికుమార్‌ మీద నమ్మకంతో మరోసారి ఛాన్స్‌ ఇచ్చాడు బాలయ్య. సోనాల్‌ చౌహాన్‌, వేదిక, భూమిక, జయసుధ, ప్రకాష్ రాజ్‌, నాగినీడు ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన రూలర్‌ ఆడియన్స్‌ ముందుకు వచ్చింది.? అయితే ఎన్టీఆర్‌ బయోపిక్‌లు డిజాస్టర్‌ అయిన బాధనుంచి అభిమానులను కోలుకునేలా చేస్తుందనుకుంటే పెద్ద దెబ్బే కొట్టింది. 
  

Balakrishna Movies

  
రూలర్  సినిమా కోసం స్లిమ్‌ లుక్‌లోకి మారిన బాలయ్య డ్యాన్స్‌లు ఫైట్లు ఇరగదీశాడనే చెప్పాలి. ఎలాగైనా హిట్ కొట్టాలి అని తన వంతుగా ఎంత కష్టపడినా.. చాలా చోట్ల వయసు కనపడిపోయింది. ముఖ్యంగా లుక్‌ విషయంలో బాలయ్యపై చాలా విమర్శలు వచ్చాయి. ఏరికోరి డిజైన్‌ చేసుకున్న పోలీస్‌ లుక్‌లో బాలయ్యను తెర మీద చూడటం ఇబ్బందికరంగా మారింది.  ఫుల్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ బాలయ్య సినిమాలో చూడొచ్చనే ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్న ఫ్యాన్స్ నిరాశపడిపోయారు.


 ‘ఎన్టీఆర్‌’ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత వచ్చే చిత్రం అన్ని హంగులతో ఉండాలని భావించిన బాలకృష్ణ.. తన తదుపరి చిత్రం కమర్షియల్‌ డైరెక్టర్‌గా పేరుగాంచిన కెఎస్‌ రవికుమార్‌కు అప్పగించాడు. అయితే బాలయ్య బాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుబు నూటికినూరు శాతం నిలబెట్టుకోలేకపోయాడు.  కేవలం బాలకృష్ణ ఇమేజ్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుని డైరెక్టర్‌ కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథలో ఏదో మూలన కాస్త కొత్త దనం కనిపించినప్పటికీ.. దానిని అటుతిప్పి ఇటుతిప్పి రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాగా మలిచాడు.
 


అయితే ఈ సినిమా కథ అసలు బాలయ్య కోసం రాసుకున్నది కాదు. ఆయన చేయాల్సింది కాదు. మరో హీరో కోసం ట్రే చేస్తే వర్కవుట్ అవ్వక బాలయ్య దగ్గరకు వచ్చిందని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు గోపీచంద్. మొదట  డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ ఈ కథని గోపీచంద్ కి వినిపించగా ఆల్ మోస్ట్ ఓకే అనుకున్న టైమ్ లో డౌట్ వచ్చి వద్దనుకున్నారు.   అదే టైం లో సంపత్ నంది… సీటిమార్ కథను వినిపించగా గోపీచంద్ ఈ ఫ్లాఫ్ మూవీ నుండి తప్పించుకున్నారు.  
 

Balakrishna


ఇక బాలయ్య కే ఎస్ రవికుమార్ కన్నా ముందు బి గోపాల్ డైరెక్షన్ లో సినిమా చేయాలి అనుకున్న కథ సిద్ధం కాక పోవడం తో సడెన్ గా కే ఎస్ రవికుమార్ దగ్గరకు ఆ ఆఫర్ వెళ్ళగా వెంటనే ఈ కథని వినిపించడం తో బాలయ్య ఓకే అన్నారు. రిజల్ట్ తెలిసిందే. అలా  గోపీచంద్ ఖాతాలో పడాల్సిన మరో ఫ్లాఫ్ సినిమా బాలయ్య 2019 ఇయర్ లో హాట్రిక్ ఫ్లాఫ్ గా పడింది… నిలిచింది.  

Latest Videos

click me!