Mahendragiri Varahi 9 Days Collections: సుమంత్‌ కి బిగ్‌ షాక్‌.. బాక్సాఫీసు వద్ద డీలా పడ్డ మహేంద్రగిరి వారాహి

Published : Sep 20, 2026, 08:05 AM IST

సుమంత్‌ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ `మహేంద్రగిరి వారాహి`. డివోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతుంది. మరి 9 రోజుల్లో ఇది ఎంత రాబట్టిందనేది చూస్తే.

PREV
13
థియేటర్లో స్ట్రగుల్‌ అవుతున్న సుమంత్

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్‌.. ఇటీవల సక్సెస్‌ విషయంలో స్ట్రగుల్‌ అవుతున్నారు. ఆయన సినిమాలు ఓటీటీలు ఆడుతున్నాయి, కానీ థియేటర్లో సత్తా చాటడం లేదు. అయినా తాను బాక్సాఫీసు వద్ద నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సినిమాల విషయంలో స్పీడ్‌ పెంచారు. అందులో భాగంగా గత వారం ఆయన `మహేంద్రగిరి వారాహి` అనే చిత్రంలో నటించారు. సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, రాజీవ్‌ కనకాల, మళవిక నాయర్‌, మీనాక్షి గోస్వామి ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 11న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

23
మహేంద్రగిరి వారాహి మూవీ కలెక్షన్లు

సుమంత్‌ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రారంభం నుంచి మిశ్రమ స్పందనని తెచ్చుకుంది. అయితే కలెక్షన్లు మొదటి వారాంతం బాగానే ఉన్నా, సోమవారం నుంచి చాలా వరకు పడిపోయాయి. క్రమంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ఇప్పటి వరకు 9 రోజులు పూర్తి చేసుకుంది. శనివారం ఈ సినిమాకి కేవలం రూ.27లక్షలు మాత్రం వచ్చాయి. కాకపోతే శుక్రవారంతో పోల్చితే వసూళ్లు పెరగడం విశేషం. శుక్రవారం దీనికి రూ.19 లక్షలు మాత్రమే వచ్చాయి. ఈ శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కటి కూడా ఆకట్టుకునేలా లేకపోవడంతో సుమంత్‌ సినిమాకి కలిసి వస్తుందని చెప్పొచ్చు.

33
భారీ నష్టాల దిశగా మహేంద్రగిరి వారాహి

ఇక `మహేంద్రగిరి వారాహి` మూవీ ఇప్పటి వరకు రూ.4.13కోట్లు వసూలు చేసింది. ఇండియాలో దీనికి రూ.3.65నెట్‌ రావడం విశేషం. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఈ లెక్కన ఈ సినిమాకి రెండు కోట్ల వరకు షేర్‌ వచ్చింది. సినిమాకి అయిన బడ్జెట్‌ సుమారు రూ.25కోట్లు అని సమాచారం. నాన్‌ థియేట్రికల్‌గా అంటే శాటిలైట్‌, ఓటీటీ, ఆడియో రూపంలో సగం బడ్జెట్‌ వచ్చిందట. ఇక మిగిలింది థియేట్రికల్‌గా రాబట్టాలి. అంటే సుమారు రూ.12-13కోట్లు థియేట్రికల్‌గా వసూలు చేయాలి. ఈ లెక్కన ఇప్పుడు ఇంకా పది కోట్ల షేర్‌ రావాలి. అంటే ఇరవై కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. ప్రస్తుతం సినిమా పరిస్థితి చూస్తుంటే అది కష్టమే అనిపిస్తుంది. ఈ మూవీ ద్వారా నిర్మాతలకు ఏడెనిమిది కోట్ల నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ లోపు ఏదైనా మ్యాజిక్‌ చేస్తుందా అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories