Guppedantha Manasu : మరో కొత్త ప్లాన్ తో శైలేంద్ర.. కొడుకు చేసిన పనికి షాక్ లో మహేంద్ర!

First Published | Oct 20, 2023, 10:06 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కొత్త కొత్త ట్విస్ట్ లతో ప్రేక్షకులు హృదయాలని గెలుచుకుంటుంది. తండ్రిని మళ్లీ మామూలు మనిషి చేయాలని తపన పడుతున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఈరోజు అక్టోబర్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో తమ్ముడిని ఓదార్చి అతనికి ధైర్యం చెప్పి తిరిగి రిషి దగ్గరికి వస్తాడు ఫణీంద్ర. జాగ్రత్తగా వెళ్లి రండి కానీ మహేంద్ర కి సంబంధించిన అప్డేట్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి అని చెప్పి భార్య కొడుకుతో పదండి వెళ్దాం అంటాడు.నన్ను వాళ్లతో వెళ్ళనివ్వలేదు కదా డాడ్, ఎక్కడికి వెళ్తారో వెళ్ళనివ్వండి, మళ్లీ వాళ్ళు రాకుండా నా ప్రయత్నాలు నేను చేస్తాను అని మనసులో అనుకుంటాడు. వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత వసుధారతో లగేజ్ చేద్దామని చెప్తాడు రిషి. సీన్ కట్ చేస్తే  ముగ్గురు అరకు రిసార్ట్ కి వస్తారు. అప్పటివరకు మహేంద్ర కి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. కారు దిగిన వెంటనే ఆ ప్లేస్ ని చూసి షాక్ అవుతాడు.
 

ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటూ పేచీ పెడతాడు.లేదు డాడ్ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది మిమ్మల్ని అమ్మ జ్ఞాపకాలు నుంచి బయటికి తీసుకురావాలంటే చేంజ్ ఓవర్ కావాలి డాడ్.అందుకే మిమ్మల్ని ప్రశాంతంగా ఉండే ఈ ప్లేస్ కి తీసుకు వచ్చాను అంటాడు రిషి. ఇది ప్రశాంతమైన ప్లేస్ ఏంటి రిషి అంటాడు మహేంద్ర. ఏం సార్ ఈ ప్లేస్ గురించి మీకు ఇంతకు ముందే తెలుసా అని అడుగుతుంది వసుధార. అలాంటిదేమీ లేదు అని చెప్పి కొడుకు సర్ది చెప్పడంతో లోపలికి వస్తాడు మహేంద్ర.
 


ఆ తర్వాత మూడీగా ఉన్న తండ్రి దగ్గరికి వచ్చి ఏంటి డాడీ మీరు చేంజ్ అవుతారని ఇక్కడికి తీసుకువస్తే ఇక్కడ కూడా ఇలాగే ఉంటే ఎలా, అమ్మ జ్ఞాపకాల్లోంచి బయటికి రండి, కొత్త కొత్త ప్రదేశాలు చూడండి, పుస్తకాలు చదవండి అంటూ తండ్రిని మోటివేట్ చేస్తాడు. నాకు చెప్తున్నావు కానీ నువ్వు మాత్రం అమ్మని మర్చిపోయావా రిషి అంటాడు మహేంద్ర. నేను బానే ఉన్నాను పర్వాలేదు నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రా అని చెప్పడం అక్కడినుంచి వెళ్తాడు రిషి.
 

 తర్వాత రిసార్ట్ లో ఒంటరిగా కూర్చొని తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అక్కడికి వచ్చిన వసుధార  ఇందాకటి నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాను, నన్ను కూడా పిలవాల్సింది కదా అంటుంది. అమ్మ గుర్తొస్తుంది వసుధార అని బాధగా చెప్తాడు రిషి. మీరు కూడా అలా అంటే ఎలా సార్, బాధలోంచి బయటికి రావాలి కదా, మీరు హ్యాపీగా ఉంటేనే మేడం కూడా హ్యాపీగా ఉంటారు.
 

అవును వసుధార అమ్మ మనల్నించి ఏమీ కోరుకోలేదు మన ప్రేమ తప్ప కానీ ఆ ప్రేమనే నేను ఆమెకి ఇవ్వలేకపోయాను. మీరు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వకండి సార్, మీరు సాధించిన విజయాలే ఆమెకి మీరు ఇచ్చే ప్రేమ అంటుంది వసుధార. డాడ్ ని అలా చూస్తుంటే భయం వేస్తుంది వసుధార, వైరాగ్యంతో ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని కంగారుగా ఉంది అంటాడు.
 

అందుకే సార్ ఆయనని ఒంటరిగా వదిలేయకుండా మనతో పాటు తీసుకువెళ్తాము కొత్త కొత్త ప్రదేశాలన్నీ చూపిద్దాము అంటుంది. సరే అంటాడు రిషి. మరోవైపు జగతి ఫోటో చూస్తూ బ్రతికున్నప్పుడు నా కొడుకుని ఎండి కాకుండా జాగ్రత్త పడ్డావు, ఇప్పుడు కూడా నా కొడుకు ఎండి కాలేకపోతున్నాడు ఎంతైనా నువ్వు చాలా తెలివైన దానివి అనుకుంటుంది దేవయాని.
 

 అంతలోనే అక్కడికి వచ్చిన సైలేంద్ర కాలేజీ వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఫణీంద్ర పదా నేను కూడా వస్తాను అంటాడు. మీరు ఎందుకు డాడ్ అంటాడు శైలేంద్ర. నువ్వు ఎందుకు అంటాడు ఫణీంద్ర. కాలేజీ చూసుకోవడానికి అంటాడు శైలేంద్ర. ముందు నీ భార్యని సరిగ్గా చూసుకో అంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు ఫణీంద్ర. అతని వెనకే సైలేంద్ర కూడా వెళ్తాడు.
 

సీన్ కట్ చేస్తే జగతి ఫోటో పట్టుకుంటూ నీ జ్ఞాపకాలనుంచి బయటకు తీసుకురావాలని నీతో పరిచయం అయిన ప్లేస్ కి తీసుకువచ్చాడు రిషి, మన ప్రేమ చిగురించిన ఈ చోటుని ఎలా మర్చిపోగలను అంటూ ఏడుస్తాడు. అప్పుడే అక్కడికి వస్తారు రిషి, వసుధార.  ఇక్కడ ఏం చేస్తున్నారు డాడీ, రండి, ఫ్రెష్ అవ్వండి సైట్ సీయింగ్ కి వెళ్దాము అంటాడు రిషి. నేనెందుకు మీరు వెళ్లి రండి అంటాడు మహేంద్ర. మిమ్మల్ని వదిలి వంటరిగా వెళ్లలేము అంటాడు రిషి.
 

నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని భయపడుతున్నారా.. భయపడకండి, మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అంటాడు మహేంద్ర. వద్దు సార్ మహేంద్ర సార్ ని ఒంటరిగా వదలొద్దు అంటుంది వసుధార. ఇంకా నీ భర్తని సార్ అనే పిలుస్తున్నావా అంటూ కోడల్ని చిన్నగా కోప్పడతాడు మహేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Latest Videos

click me!