Tiger Nageswara Rao Review: టైగర్ నాగేశ్వరరావు ప్రీమియర్ టాక్: రవితేజ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్!

First Published | Oct 20, 2023, 7:15 AM IST

మాస్ మహారాజ్ రవితేజ దసరా బరిలో టైగర్ నాగేశ్వరరావు గా దిగారు. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కించగా నుపుర్ సనన్ హీరోయిన్. ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామా ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. టాక్ ఏంటో చూద్దాం... 
 

Tiger Nageswara Rao Review- Premier Talk

టైగర్ నాగేశ్వరరావు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం. 70లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, చీరాల వద్ద గల స్టూవర్టుపురం లో పుట్టిన ఒక నిరుపేద కుర్రాడు దేశాన్ని గడగడలాడించే దొంగ అయ్యాడు. పెద్దలను దోచి పేదలకు పెట్టి ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరు తెచ్చుకున్నాడు. చెప్పి దొంగతనాలు చేయగల దిట్ట. వేగంలో టైగర్ లాంటోడు. అందుకే నాగేశ్వరరావు అనే ఈ దొంగ టైగర్ నాగేశ్వరరావు అయ్యాడు.

Tiger Nageswara Rao Review- Premier Talk

ఒక మాస్ కమర్షియల్ సబ్జెక్టు కి కావాల్సిన అన్ని అంశాలు టైగర్ నాగేశ్వరావు జీవితంలో ఉన్నాయి. చాలా కాలంగా టైగర్ నాగేశ్వరరావు జీవితం వెండితెరపైకి తేవాలనే డిమాండ్ ఉంది. ఎట్టకేలకు అది వెండితెర రూపం దాల్చింది. కొంత ఫిక్షన్ జోడించి దర్శకుడు వంశీ టైగర్ నాగేశ్వరరావు మూవీ తెరకెక్కించాడు.


Tiger Nageswara Rao Review- Premier Talk

ఇక టైగర్ నాగేశ్వరరావు యూఎస్ ప్రీమియర్స్ ముగిశాయి. ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ మురళీ శర్మ ఢిల్లీలో కొందరు అధికారులతో అసలు టైగర్ నాగేశ్వరరావు అంటే ఎవడు? అతని సత్తా ఏమిటో చెబుతున్న సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అవుతుంది.

Tiger Nageswara Rao Review- Premier Talk

ఇక టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని ప్రీమియర్ టాక్. టైగర్ నాగేశ్వరరావు పాత్రను పరిచయం చేసిన తీరు. క్యారెక్టరైజేషన్ బాగా కుదిరాయి. రోబరీ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్లు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో రెండు దోపీడీ సన్నివేశాలు ఉన్నాయి. వాటిలో ట్రైన్ రాబరీ సన్నివేశం హైలెట్ అంటున్నారు.

Tiger Nageswara Rao Review- Premier Talk


ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుందని ప్రేక్షకుల అభిప్రాయం. మొదటి సగం దర్శకుడు గొప్పగా నడిపించాడు. సెకండ్ హ్లాఫ్ మాత్రం డ్రాగ్ అయ్యిందంటున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ నిడివి దాదాపు మూడు గంటలు. ఈ క్రమంలో సెకండ్ హాఫ్ లెంగ్తీ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. క్లైమాక్స్ సన్నివేశాలు మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ ట్రిమ్ చేసి ఉంటే మరింత మంచి ఫలితం దక్కేది అంటున్నారు. 
 

Tiger Nageswara Rao Review- Premier Talk

ఫైట్ సన్నివేశాలు బాగున్నాయి. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ ఏమంత ఉన్నతంగా లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయని అంటున్నారు. జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ కి పాస్ మార్క్స్ వేశారు. బీజీఎమ్ బాగుంది. అయితే సాంగ్స్ అంతగా మెప్పించలేదని టాక్. 
 

ఇక రవితేజ డార్క్ షేడ్ రోల్ లో చక్కగా సెట్ అయ్యాడు. టైగర్ నాగేశ్వరరావు పాత్రకు ఆయన మేనరిజం బాగా సెట్ అయ్యింది. ఆయనపై వచ్చే మాస్ ఎలివేషన్స్ సీన్స్ గూస్ బంప్స్ కలిగిస్తాయి. హీరోయిన్ నుపుర్ సనన్ తో కెమిస్ట్రీ పర్లేదు. 
 


నాజర్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్, జిషు సేన్ గుప్తా... తన పాత్రల పరిధిలో మెప్పించారు. మొత్తంగా టైగర్ నాగేశ్వరరావు హిట్ మూవీ అంటున్నారు. సెకండ్ ట్రిమ్ చేసి మరింత ఆసక్తిగా తీర్చి దిద్ది ఉంటే ఇంకా మెరుగైన ఫలితం దక్కేది అంటున్నారు. ఇక దసరా బరిలో టైగర్ నాగేశ్వరరావుతో పాటు లియో, భగవంత్ కేసరి దిగాయి. దసరా విన్నర్ ఎవరో ఈ వీకెండ్ ముగిస్తే కానీ తెలియదు... 
 

Latest Videos

click me!