Sarayu Controversy: వివాదంలో బోల్డ్ బ్యూటీ, బిగ్ బాస్ సరయుపై కేసు నమోదు.. ఆ వీడియోలో ఏముంది ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 07, 2022, 12:53 PM IST

యూట్యూబ్ లో సరయు ఎంత ఫేమస్సో కుర్రాళ్ళకి బాగా తెలుసు. ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ యూట్యూబ్ లో బోల్డ్ డైలాగ్స్ తో కొత్త ట్రెండ్ కు తెరతీసింది సరయు.

PREV
16
Sarayu Controversy: వివాదంలో బోల్డ్ బ్యూటీ, బిగ్ బాస్ సరయుపై కేసు నమోదు.. ఆ వీడియోలో ఏముంది ?

యూట్యూబ్ లో సరయు ఎంత ఫేమస్సో కుర్రాళ్ళకి బాగా తెలుసు. ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ యూట్యూబ్ లో బోల్డ్ డైలాగ్స్ తో కొత్త ట్రెండ్ కు తెరతీసింది సరయు. షార్ట్ ఫిలిమ్స్, స్కిట్స్ ని బోల్డ్ డైలాగులతో చేస్తూ వైరల్ సృష్టిస్తోంది ఈ భామ. 

 

26

గత ఏడాది సరయు బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టే సరయు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఇముడుతుంది అని అంతా భావించారు. అయినప్పటికి ఆమెపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఊహించని విధంగా సరయు ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది. 

 

36

హౌస్ లో బోల్డ్ గా ఎంటర్టైన్ చేస్తుందని కుర్రాళ్లంతా భావిస్తే తొలి వారంలోనే తుస్సుమని నిరాశపరిచింది. రియల్ లైఫ్ లో కూడా సరయు బోల్డ్ యాటిట్యూడ్ తోనే ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ లో సరయు రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు మాటలతో సరయు బీభత్సం సృష్టిస్తోంది. 

 

46

ఇదిలా ఉండగా సరయు తాజాగా చిక్కుల్లో చిక్కుకుంది. హోటల్ ప్రమోషన్స్ కోసం తీసిన సాంగ్ వివాదంగా మారింది. ఈ కేసుని బంజారాహిల్స్ పోలీసులు అందుకున్నారు. హోటల్ ప్రమోషన్ కోసం సరయు ఆమె టీం ఓ సాంగ్ చేశారట. 

 

56

ఆ సాంగ్ లో గణపతి బొప్ప మోరియా అని రాసిన బ్యాండ్లు ధరించారు. అలాగే మద్యం సేవిస్తున్నట్లు వీడియో చిత్రీకరించారు. ఇది కాస్త తీవ్ర వివాదంగా మారింది. ఈ వీడియో హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉందంటూ రాజన్న సిరిసిల్లలో విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ కేసు నమోదు చేశారు. 

 

66

ఇప్పుడు ఆ కేసుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసు నుంచి సరయు ఎలా బయట పడుతుంది, పోలీసులకు ఎలాంటి వివరణ ఇస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది.  

 

click me!

Recommended Stories