అదొక విష బంధం, ప్రేమ, పెళ్ళి గురించి హీరోయిన్ అంజలి సంచలన వ్యాఖ్యలు

Published : Dec 13, 2022, 08:07 AM IST

హీరోయిన్ అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రేమ, పెళ్ళి కి సబంధించి కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తన అభిప్రాలు పంచుకున్నారు అంజలి. తన పెళ్ళి గురించి కూడా క్లారిటీ ఇచ్చారు అంజలీ. 

PREV
16
అదొక విష బంధం, ప్రేమ, పెళ్ళి గురించి హీరోయిన్ అంజలి సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ అంజలీ తన పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చింది. గతంలో తను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు  వెల్లడించింది అంజలీ. అయితే అది ఓ విషపూరిత బంధం అని.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తనకు.. ఆ వ్యక్తి వల్ల నిరాశ ఎదురయ్యిందన్నారు.  ఆ బంధానికి అక్కడితో బ్రేక్ పడిందన్నారు అంజలి. 
 

26

ఇక కోలీవుడ్ హీరో.. జర్నీ ఫేమ్ హీరో జైతో  తను ప్రేమలో ఉన్నానంటూ వస్తున్న వార్తలపై కూడా అంజలీ స్పందించారు. ఇండస్ట్రీలో తాను ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని ఎప్పుడూ చెప్పలేదని. అయినా  తాను ఇండస్ట్రీలో  ఎవరితో స్నేహంగా ఉన్నాను.. తనకు ఎంత మంది స్నేహితులు ఉన్నారు  అన్నది పూర్తిగా తన వ్యాక్తిగతం అనిసమాధానం ఇచ్చారు అంజలి. 
 

36

ఇక తన పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు... తప్పకుండా పెళ్ళి చేసుకుంటానని.. మంచి మనసున్న వ్యాక్తి, తనను గౌరవించే భర్త  దొరికినప్పుడు చేసుకుంటానంటూ .. సమాధానం ఇచ్చారు. అంతే కాదు తనకు అమెరికాకు సబంధించిన ఓ బిజినెస్ మెన్ తో పెళ్ళి అయిపోయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు అంజలి. అలాంటి వార్తలు విని నవ్వుకుంటానన్నారు. 

46

పేరుకు తెలుగు అమ్మాయి అయిన అంజలి తమిళనాట మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. అక్కడే హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. అప్పుడుప్పుడు తెలుగులో మెరుపులు మెరిపిస్తూ.. హడావిడి చేసింది.  ఫోటో సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి.. ఆతర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌కు మకాం మార్చింది. 

56

కట్రదు తమిజా అనే తమిళ సినిమాతో కోలీవుడ్  ఎంట్రీ ఇచ్చింది అంజలి. మొదటి సినిమాతోనే సూపర్‌ సక్సెస్‌ సాధించింది. దాంతో వరుసగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. మళ్ళీ ఏడేళ్లకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్  సాధించడంతో తెలుగులో కూడా  మంచి గుర్తింపు వచ్చింది. 

66

దాంతో అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా మారింది. ప్రస్తుతం అంజలీ ఈమె రామ్‌చరణ్‌ హీరోగా శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న  ఆర్‌సీ15లో కీలకపాత్రలో నటిస్తోంది. అంజలి ఖాతాలో మరికొన్ని సినిమాలున్నాయి. 
 

click me!

Recommended Stories