ఈరోజు ఎపిసోడ్ లో దుర్గ చెప్పు బంగారం ఎవరిని చంపావో అని అడగగా తెలీదురా అని అంటుంది. టైం లేదు బంగారం తొందరగా చెప్పు అని దుర్గా అనగా తెలియదు తెలియదు అని గట్టిగా అరుస్తుంది మోనిత. ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి ఏం తెలియదు మోనిత అనడంతో మోనిత షాక్ అవుతుంది. ఏం తెలియదు ఎవరితో మాట్లాడుతున్నావు మోనిత అని అనగా హలో కార్తీక్ సార్ అని దుర్గా లోపలి నుంచి పిలిచి నువ్వు లోపలే ఉండు ఇప్పుడే వస్తానని తాళం వేసి నాకు తాళం చెవి ఇచ్చిపోయింది సర్ అని మోనిత ను అడ్డంగా ఎక్కిస్తాడు దుర్గ. రేయ్ అప్పుడు నిన్ను చంపేస్తా కార్తీక్ వాడి మాటలు నమ్మద్దు కార్తీక్ వాడు వంటలక్క మనిషి వాడి మాటలు నమ్మొద్దు అనడంతో వెంటనే కార్తీక్ సిగ్గుండాలి ఆ మాట అనడానికి అని అంటాడు.