40 కోట్ల బడ్జెట్‌.. 340 కోట్ల కలెక్షన్స్‌.. ఓటీటీలోకి భారీ బ్లాక్ బస్టర్

Published : Sep 19, 2025, 09:13 AM IST

OTT Movie: కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా ₹320 కోట్ల వసూళ్లు రాబట్టింది. అద్భుతమైన రికార్డు సృష్టించిన మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? 

PREV
15
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ

Mahavatar Narsimha OTT: థియేటర్లలో సంచలనం సృష్టించిన యానిమేషన్ మూవీ‘మహావతార్ నరసింహ’. ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ, ఇండియాలో రూ. 249 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹340.5 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డు సృష్టించింది. 

25
థియేటర్స్‌లో బ్లాక్‌బస్టర్

అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మహావతార్ నరసింహ’.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘మహావతార్ నరసింహ’థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. అద్భుతమైన యానిమేషన్, బలమైన కథనం, ప్రత్యేకంగా చూపించిన పురాణ తత్త్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కట్ చేస్తే.. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.

35
కథ – పురాణాల ఆధారంగా

‘మహావతార్ నరసింహ’ సినిమా విష్ణు పురాణం, నరసింహ పురాణం, శ్రీమద్భాగవత పురాణం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో భక్త ప్రహ్లాదుడి కథను చూపించారు. తన భక్తుడిని రక్షించడానికి విష్ణువు అత్యంత ఉగ్రరూపమైన నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించే ఘట్టాన్ని అద్భుతమైన యానిమేషన్, స్క్రీన్‌ప్లే, విజువల్స్‌తో ప్రదర్శించారు.

45
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

థియేటర్లలో సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ఇప్పుడు అదే మాజిక్ ఓటీటీ వేదికపై కూడా కొనసాగించడానికి వస్తుంది. తాజాగా ప్రకటించిన అప్‌డేట్ ప్రకారం.. మహావతార్ నరసింహ’ సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12:30 గంటలకు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

థియేటర్లలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ, ఓటీటీలో కూడా అదే స్థాయిలో ట్రెండ్ క్రియేట్ చేస్తుందా అన్నది చూడాలి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రాంగ్ కంటెంట్‌కు ఎప్పుడూ మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఈ విషయం పరిగణనలోకి తీసుకుంటే ‘మహావతార్ నరసింహ’ స్ట్రీమింగ్ కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం లేకపోలేదు.

55
మహావతార్ సినెమాటిక్ యూనివర్స్

‘మహావతార్ నరసింహ’తో మొదలైన ఈ ప్రయాణం, ఒక్క సినిమాతో ముగియదు. మేకర్స్ ఇప్పటికే మహావతార్ సినెమాటిక్ యూనివర్స్ (MCU) ను ప్రకటించారు. రాబోయే చిత్రాల జాబితా ఇలా ఉంది: మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ద్వారకాధీశ్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి (2035–2037).

మహావతార్ సినెమాటిక్ యూనివర్స్ పై దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ “మన పురాణ గాథలు, మన సంస్కృతిని సిల్వర్ స్క్రీన్ పై చూపించాల్సిన అవసరం ఉంది. ఈ కథలు కేవలం వినోదం కోసం కాకుండా, మన సాంస్కృతిక విలువలను భవిష్యత్ తరాలకు చేరవేయడానికి కూడా ఉపయోగపడతాయి” అని పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories