ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన Pushpa చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో భారీ చిత్రం ఇది. పైగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ అవుతోంది. దీనితో పుష్ప రిలీజ్ కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తోంది. పుష్ప చిత్రంలో ప్రధానంగా ప్రేక్షకులని కొన్ని అంశాలు ఆకర్షిస్తున్నాయి. అల్లు అర్జున్ గెటప్, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం, సుకుమార్ దర్శకత్వం, దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు సమంత తొలి సారి చేసిన ఐటెం సాంగ్.. ఇలా అనేక అంశాలు పుష్ప చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి.
ముఖ్యంగా యువత, Samantha అభిమానులు 'ఊ అంటావా ఊ ఊ అంటావా' అనే స్పెషల్ సాంగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ అందించిన బీట్, ప్రముఖ సింగర్ మంగ్లీ సోదరి ఇంద్రావతి మత్తెక్కించేలా అందించిన గాత్రం ఈ సాంగ్ ని సూపర్ హిట్ చేశాయి. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో ఈ సాంగ్ దూసుకుపోతోంది.
చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. అయితే ఈ పాటలో మగవారి గురించి తప్పుగా రాసిన లిరిక్స్ పై పెద్ద వివాదమే సాగుతోంది. ఆడవారి నుంచి మగవారు కోరుకునేది శృగారం మాత్రమే అని అర్థం వచ్చేలా ఈ పాట సాగుతుంది. మగవారి బుద్ది వంకర బుద్ది అనే లిరిక్స్ కూడా ఈ పాటలో ఉన్నాయి. దీనితో ఇప్పటికే ఈ సాంగ్ పై పురుషుల సంఘం కేసు కూడా నమోదు చేసింది.
ఈ పాటని బ్యాన్ చేయాలని పురుషుల సంఘం డిమాండ్ చేస్తోంది. దీనిపై నటి మాధవి లత సెటైరికల్ గా స్పందించింది. సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది. 'వాయమ్మో పుష్ప ఐటెం సాంగ్ మీద కేసు అంటగా.. ఇండస్ట్రీలో 98 శాతం పాటలు ఇలాగే ఉంటాయి. ప్రతి సాంగ్ పై కేసు పెట్టుకుంటూ పోతే ఇక పాటలు లేని సినిమాలు చేసుకోవాల్సిందే.
నేను కూడా అమ్మాయిలపై రాసే సాంగ్స్ మీద కేసులు పెడతా అని కామెంట్స్ చేసింది. పుష్ప చిత్రంలోనే ఉన్న 'సామి సామి' సాంగ్ పై తాను కేసు పెడతా అంటూ మాధవి లతా సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఏంటి.. ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతడు పిలిస్తే అంత చులకనగా వెళ్ళిపోతుందా... అబ్బాయి నడచి వెళ్లిన చోట భూమికి మొక్కుతుందా.. మహిళల పరువు పోయింది.