పుష్ప చిత్రం కోసం బన్నీతో పాటు చిత్ర యూనిట్ మొత్తం దాదాపు రెండేళ్లు ఎంతో శ్రమించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. సుకుమార్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని విధంగా అల్లు అర్జున్ ని విభిన్నమైన గెటప్, యాటిట్యూడ్ లో ప్రజెంట్ చేస్తున్నాడు. బన్నీ ప్రాణం పెట్టి చేసిన చిత్రం ఇది. దీనితో ఈ చిత్ర ఫలితంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.